సాధారణంగా ఏ దర్శకుడికైనా ఏ పరిశ్రమలో అయినా వరుసగా రెండు భారీ డిజాస్టర్లు పడితే కోలుకోవడం చాలా కష్టం, టాలీవుడ్లో ఒక సినిమా తేడా కొడితేనే అవకాశాలు తగ్గిపోయే ఈ రోజుల్లో, ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి ఇండస్ట్రీ డిజాస్టర్ల తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్ ఇక క్లోజ్ అని అందరూ భావించారు. కానీ పూరి స్టైలే వేరు.. ఆయన మళ్ళీ పుంజుకుంటున్న తీరు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది, పూరి జగన్నాథ్ ప్రస్తుతం వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో ‘స్లమ్ డాగ్’ అనే క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండగా, పూరి తన తదుపరి ప్లాన్లను అంతకంటే వేగంగా సిద్ధం చేసుకోవడం విశేషం, పరాజయాలు పలకరించినా, ఆయన కథలపై ఉన్న నమ్మకంతో అగ్ర హీరోలు పూరితో పని చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
Also Read:Sai Dharam Tej: క్రేజీ మల్టీ స్టారర్ రిజెక్ట్ చేసిన తేజ్
పూరి జగన్నాథ్ మార్క్ మేనరిజమ్స్ మరియు డైలాగ్స్ అంటే హీరోలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది, తాజా సమాచారం ప్రకారం, పూరి చెప్పిన ఒక పవర్ ఫుల్ కథకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సూర్య-పూరి కాంబినేషన్ దాదాపు లాక్ అయినట్టే అని తెలుస్తోంది, కేవలం సూర్య మాత్రమే కాకుండా, మరో స్టార్ హీరోకి కూడా పూరి కథ వినిపించారు. ఆ సినిమా కూడా దాదాపు ఓకే అయ్యే పొజిషన్లో ఉంది. వరుస ఎదురుదెబ్బలు తగిలినా, ఒకేసారి ముగ్గురు పెద్ద హీరోలను లైన్లో పెట్టడం అంటే అది పూరి జగన్నాథ్ కి మాత్రమే సాధ్యమయ్యే విషయం, ‘స్లమ్ డాగ్’ విడుదల కాకముందే ఈ రేంజ్ లో ప్రాజెక్టులు సెట్ అవ్వడం ఆయన ఫ్యాన్స్‌కు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఈ సారి పూరి తన పాత ఫామ్‌ను అందిపుచ్చుకుని బాక్సాఫీస్ వద్ద గర్జన చేస్తారో లేదో చూడాలి.




