15
February, 2026

A News 365Times Venture

15
Sunday
February, 2026

A News 365Times Venture

HYD SPA VYABHICHARAM: మసాజ్ థెరపిస్టుల పేరుతో యువతుల నియామకం.. క్రాస్ మసాజ్‌ చేయుస్తున్న ముఠాలు

Date:

హైదరాబాద్‌లో వెల్‌నెస్‌ సెంటర్లు, స్పాలు, మసాజ్ సెంటర్లు పక్కదారి పడుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకు వచ్చిన యువతులకు ఉద్యోగాలు అంటూ ఎర వేస్తున్నారు. చివరికి వారిని గలీజ్ దందాలోకి దించుతున్నాయి కొన్ని ముఠాలు. అలాంటి ఓ ముఠా బాగోతాన్ని బయటపెట్టారు పోలీసులు. కూకట్‌పల్లి అడ్డాగా సాగుతున్న గలీజ్ దందా గుట్టు విప్పారు.

Also Read:Holiday After Maha Shivaratri 2026: శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ

వెల్‌నెస్ సెంటర్లు.. స్పా సెంటర్లు.. మసాజ్ సెంటర్లు.. వీటితో కొంత మంది అక్రమ దందా.. నిజానికి ఇవి శారీరక, మానసిక ఆరోగ్యం కోసం స్వాంతన కలిగించేవి. కానీ ఇప్పుడు వీటి పేర్లతో కొంత మంది అక్రమ దందా చేస్తున్నారు. హైదరాబాద్‌లో రకరకాల పేర్లతో.. చివరకు ఆయుర్వేదం పేరును కూడా వినియోగించుకుని అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్‌లోనే కాదు మెట్రో సిటీల్లో రిచ్ లుక్‌తో కస్టమర్లను ఆకర్షించేందుకు అందంగా, స్టైలిష్‌గా సెంటర్లను తీర్చిదిద్దుతున్నారు. అలా అని లోపలికి వెళ్లారో.. మనకు తెలియకుండానే మాయమాటలతో నమ్మించి టెంప్ట్ చేస్తారు. ఇలాంటి వాటి లోపలికి వెళ్తే కానీ.. అసలు యవ్వారం అర్థంకాదు.

అంతా గబ్బు, గలీజు పనులు కోసమే ఇలాంటి సెంటర్లను కొంత మంది ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చే ఎంతో మంది యువతులను ఇలాంటి వెల్‌నెస్ సెంటర్, స్పా సెంటర్‌ల నిర్వాహకులు ట్రాప్ చేసి పెట్టుకుంటారు. యువతులకు మాయమాటలు చెప్పి.. వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని వారిని వ్యభిచారం రొంపిలోకి దింపుతున్నారు.

ఇలా మెట్రో నగరాల్లోకి పొట్ట చేతపట్టుకొని వచ్చిన యువతులు.. తమకు తెలియకుండానే అసాంఘీక కార్యకలాపాల్లోకి దిగిపోతున్నారు. వారిని మసాజ్ థెరపిస్టుల పేరుతో కొంతమంది యువతులను నియమించుకుని క్రాస్ మసాజ్‌ చేయుస్తున్నారు. ఆ తర్వాత వారిని నెమ్మదిగా వ్యభిచారం కూపంలోకి దించుతున్నారు నిర్వాహకులు. ఇందుకోసం కస్టమర్ల దగ్గర కూడా డబ్బులు బాగానే గుంజుతున్నారు.

తాజాగా కేపీహెచ్‌బీలోని రోడ్డు నెంబర్ 6 లోని‌ గాయత్రి‌రెసిడెన్సీ.. సెకండ్‌ ఫ్లోర్‌లో ఆసనా వెల్‌నెస్ స్టూడియోలో జరుగుతున్న బాగోతంపై పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఆసనా వెల్‌నెస్ స్టూడియో మెయిన్ రోడ్డుపై అపార్ట్‌మెంట్‌ల మధ్య ఉంది. అప్పటికే అక్కడ ఉన్న స్థానికులంతా వెల్‌నెస్ స్టూడియో దగ్గరికి పోలీసులు రావడంతో ఖంగుతిన్నారు. అప్పటి వరకు అక్కడే ఏం జరుగుతుందో తెలియక వారంతా ఆశ్చర్య పోయారు. వెల్‌నెస్ స్టూడియో నుంచి‌ వరుసగా అమ్మాయిలతో పాటు మరి కొంత మందిని పోలీసులు బయటికి తీసుకువస్తుండటంతో అప్పటికి కానీ అర్థం కాలేదు. వెల్‌నెస్ స్టూడియో ముసుగులో అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని జనం ఒక్కసారిగా షాకయ్యారు.

ఆసనా స్టూడియోపై దాడి చేసిన పోలీసులు లోపల జరుగుతున్న తతంగం చూసి ఆశ్చర్య పోయారు. అప్పటికే స్టూడియోలో రూముల్లో యువతీ యువకులు సగం బట్టలతో కనిపించడంతో.. వ్యభిచారం నిర్వహిస్తున్న వైనాన్ని నిర్ధారించుకున్నారు. దీంతో ఆసనా వెల్ నెస్ స్టూడియో నిర్వాహకులతో పాటు మరో 18 మందికి పైగా విటులను, 15 మంది యువతులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

వెల్‌నెస్‌ సెంటర్లు, స్పాలు నిర్వహించాలనుకునేవారు నిబంధనలో పాటించాలని పోలీసులు చెబుతున్నారు. క్రాస్ మసాజ్ చేయాలంటే కచ్చితంగా ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ ఉండాలని లేదా ఓపెన్ డోర్ ఉండాలని, అలాగే థెరిపిస్ట్ సర్టిఫికెట్లు ఉండాలని చెబుతున్నారు. ఒకవేళ ఇలాంటి నిబంధనలు ఎవరు పాటించక పోయినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

Also Read:Tollywood Love Marriages: లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!

వెల్‌నెస్ స్టూడియోపై దాడి తర్వాత 42 ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. విటులపై కేసు నమోదు చేశారు. నిర్వాహకులు ఇమ్రాన్‌తో పాటు మరో ఇద్దరిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు.. మణిపాల్, ఉత్తరాఖండ్, ఢిల్లీ , పంజాబ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతులను సఖీ సెంటర్‌కు తరలించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Asaduddin Owaisi: “టిప్పు సుల్తాన్ ఎప్పుడూ ప్రేమలేఖలు రాయలేదు”.. మాలేగావ్ వివాదంపై ఓవైసీ..

Asaduddin Owaisi: మాలేగావ్‌లో ‘‘టిప్పు సుల్తాన్’’ ఫొటో వివాదం మహారాష్ట్రలో రాజకీయ...

Maha Shivaratri 2026: శివనామ స్మరణతో తరిద్దాం.. మహాశివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ ఎందుకు చేయాలో తెలుసా?

మాఘ మాసంలోని బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి కేవలం ఒక...

Advocate Swapna Murder Case: పక్కా స్కెచ్‌తో చెల్లిని అంతమొందించిన అన్న!

Advocate Swapna Murder Case: రంగారెడ్డి జిల్లాలో అడ్వకేట్ స్వప్న మర్డర్...

Off The Record: పబ్లిసిటీ పీక్స్లో ఉన్న వాళ్ల ర్యాంకింగ్స్ వీక్గా ఉన్నాయా..?

Off The Record: ఉమ్మడి విశాఖ జిల్లాలో పొలిటికల్ డైనమిక్స్ ఎప్పుడూ...