1
July, 2026

A News 365Times Venture

1
Wednesday
July, 2026

A News 365Times Venture

Hyderabad: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి సూసైడ్ కేసులో ఊహించని ట్విస్ట్.. భర్త ఏమన్నారంటే?

Date:

Hyderabad: ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి విజయశాంతి రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఇటీవల తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఏదో బలమైన కారణమే ఉందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.. విజయశాంతి రెడ్డి మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్‌ను CCS పోలీసులకు పంపారు. మొబైల్‌లో కొన్ని అనుమానిత మెసేజ్‌లు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి రైల్వే డీఎస్పీ తాజాగా ఎన్టీవీతో మాట్లాడారు. “ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయ శాంతి రెడ్డి కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.. కుటుంబ సభ్యులను విచారించాం. ఎలాంటి కుటుంబ కలహాలు లేవు అని చెప్తున్నారు.. ఉద్యోగం చేస్తున్న సంస్థలో కూడా విచారించాం. అక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేవు.. విజయరెడ్డి, ఇద్దరు పిల్లలని తీసుకుని 30న అర్ధరాత్రి స్టేషన్‌కు వచ్చారు.. ఫ్లాట్ ఫాంపై కొద్దిసేపు పిల్లలతో కలిసి తిరిగారు. చర్లపల్లి వైపు ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్ళి.. గూడ్స్ ట్రైన్ వస్తున్న సమయంలో ట్రాక్ మధ్యలో నిల్చున్నారు. గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఇతను చెప్తున్న ప్రకారం.. ట్రాక్ మధ్యలో ముగ్గురూ ఒకరిని ఒకరు గట్టిగా హత్తుకుని నిల్చున్నారు. గట్టిగా కేకలు వేస్తూ తప్పుకోండి అని అరుస్తున్న కూడా పక్కకు జరగలేదని చెప్తున్నాడు.. కారులో సూసైడ్ నోట్ లభ్యమైంది.. నా చావుకి ఎవరూ కారణం కాదు. బతకడం భారంగా ఉంది అని రాసి ఉంది. 28న వాళ్ళ పెళ్లి రోజు అని తెలిసింది.. 31న భర్త పుట్టిన రోజు అని తెలిసింది.. బంధువులు ఒకరు చనిపోయారు.. వెళ్ళాలి అని హాస్టల్ లో ఉన్న పిల్లలను తీసుకెళ్లింది తల్లి.. విజయశాంతి మొబైల్ ఫోన్‌ను సీసీఎస్‌కి పంపించాం. లాస్ట్ కాల్ డీటెయిల్స్, అందులో ఉండే సమాచారంతో మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఆమె ల్యాప్ టాప్‌ను కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు పంపించాం.” అని తెలిపారు.

READ MORE: డిజైన్, పవర్‌లో ఫార్చ్యునర్‌కు ఫుల్ ఛాలెంజ్.. MG Majestor టీజర్ రిలీజ్.. లాంఛ్ డేట్ ఫిక్స్!

ఈ సూసైడ్ అంశంపై విజయశాంతి రెడ్డి భర్త తాజాగా ఎన్టీవీతో మాట్లాడారు. “నా భార్య ధైర్యవంతురాలు, ఎందుకు ఆత్మహత్య చేసుకోండి దేవునికి తెలియాలి.. నాకు ఎలాంటి సమాచారం లేదు. చివరిసారిగా నేను నా భార్యతో మాట్లాడినప్పుడు పిల్లల ఎదుగుదల గురించి మాట్లాడాము.. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. నేను దుబాయ్ లో ఉన్నను.. నాకు ఎలాంటి విషయం తెలియదు.. ఆర్థికంగా కుటుంబ పరంగా సమస్యలు లేవు.. ఆఫీసులో ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పేది, కానీ సమస్యలు లేవు.. నా కూతురుతో మాట్లాడాను జేఈఈ ఎగ్జామ్స్ బాగా రాసానని దాడి అని చెప్పింది.. కొడుకు కూతురుకి మంచిగా చదువుకొమణి చెప్పాను.. విజయశాంతి రెడ్డి మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను CCS పోలీసులకు పంపారూ రైల్వే పోలీసులు. పోలీసులు దర్యాప్తు చేస్తే నిజాలు బయటకు వస్తాయి.. ఎలాంటి విషయాలున్న మేము కులంకషంగా మాట్లాడే వాళ్ళం. నేను షాక్ లో ఉన్నాను.. నా భార్య చేస్తున్న సంస్థ లో అక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేవు.. విజయ రెడ్డి తో 29న మాట్లాడాను, 28న కూతురుతో మాట్లాడాను.. ఎవరి పైన నాకు అనుమానం లేదు మరొకసారి ఫిర్యాదు చెయ్యను.. సూసైడ్ నోట్ లోనూ ఏం సమాచారం లేదు.. లోన్లీనెస్ ఫీల్ అయి సూసైడ్ చేసుకుందా తెలియదు.. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలి.” అని భర్త స్పష్టం చేశారు.

READ MORE: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్‌ జగన్‌ సవాల్..

Mavigan vs Amaravati: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు...

Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!

Unused Apps: స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. రకరకాల యాప్‌లను డౌన్‌లోడ్...

Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!

Asian Games 2026: ఈ ఏడాది సెప్టెంబర్‌లో జపాన్‌లోని ఐచి-నగోయా (Aichi-Nagoya)...