ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా సాగుతోంది. దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక సినీ, రాజకీయ, క్రీడాకారులంతా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా కుంభమేళాలో ప్రముఖ భారత మాజీ రెజ్లర్ గ్రేట్ ఖలీ పవిత్ర స్నానం చేశారు. అయితే గ్రేట్ ఖలీని స్నానం చేయకుండా భక్తులు చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. ఇక సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. దీంతో గ్రేట్ ఖలీ ఇబ్బంది పడినట్లుగా కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Modi-Trump: మోడీ-ట్రంప్ భేటీపై ఇరు దేశాలు ప్రయత్నాలు.. త్వరలోనే తేదీ ప్రకటన..
ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట తర్వాత పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే వీఐపీల దర్శనం కూడా రద్దు చేశారు. ఇదిలా ఉంటే గురువారం గ్రేట్ ఖలీ వచ్చారు. స్నానం చేస్తుండగా భక్తులు, సెక్యూరిటీ అధికారులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చాలా మంది అత్యుత్సాహం ప్రదర్శించారు, దీంతో గ్రేట్ ఖలీ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలా ప్రతిరోజూ అనేక మంది వీఐపీలు వచ్చి స్నానాలు చేస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram




