పహల్గాం టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో అనూహ్యంగా ప్రభాస్-హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఇమాన్వి ఇస్మాయిల్ ఇబ్బందుల్లో పడింది. ఆమె హీరోయిన్‌గా ఎంపికైనప్పుడే పాకిస్తాన్ మూలాలు ఉన్న నటిగా ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ కాల్పుల విషయంలో బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా లేని నేపథ్యంలో, దౌత్యపరంగా భారత్ అనేక ఆంక్షలు విధించింది. సాంస్కృతికపరంగా కూడా పాకిస్తాన్ నటీనటులు నటించిన సినిమాలను బ్యాన్ చేయాలని వాదన వినిపిస్తోంది. ఇప్పటికే అబీర్ గులాల్ అనే ఒక సినిమాను బ్యాన్ చేస్తూ కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది.
Chiru Anil : చిరుకి విలన్ గా యంగ్ హీరో?
అయితే, ప్రభాస్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఇమాన్వి మాత్రం తన తండ్రి మాజీ మిలిటరీ ఆఫీసర్ అనే ప్రచారాన్ని తిప్పికొట్టింది. తన కుటుంబానికి పాకిస్తాన్ మిలిటరీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. అంతేకాక, తాను భారత మూలాలు ఉన్న వ్యక్తిని చెప్పుకుంటూ ఈ ప్రచారాన్ని ఇక్కడితో ఆపాలని కోరింది. అయితే, నిజానికి ఆమె తండ్రి పాకిస్తాన్ జాతీయుడని, తల్లి భారత జాతీయురాలని తెలుస్తోంది. వీరు గతంలోనే అమెరికాలోని కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ పట్టణంలో సెటిల్ అయ్యారని, ఇమాన్వి ఇస్మాయిల్ అక్కడే చదువుకుందని తెలుస్తోంది. పాకిస్తాన్ మూలాలు ఉన్న మాట వాస్తవమే కానీ, పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే, ఆమె మాత్రం తనకు పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం గమనార్హం.