Viral Video: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో దుమారం రేపింది. పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన పహల్గామ్‌లో జరిగిన ఈ దాడిలో నిరాయుధ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిపై ఇంటెలిజెన్స్ విభాగం ముందస్తు హెచ్చరిక ఇవ్వలేకపోవడంపై రక్షణ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడి అనంతరం కూడా చాలా సమయం పాటు భద్రతా బలగాలు అక్కడికి చేరుకోలేకపోయిన పరిస్థితి కఠిన ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కొన్ని విపక్ష పార్టీలు నిప్పులు చెరిగుతున్నాయి. దాడి అనంతరం ప్రభుత్వం తాము తప్పులేనట్టు ప్రచారం చేయడం, బాధ్యతను ఎవరికీ వేయకపోవడం కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ దాడిలో ఓ చిన్న బాలుడు తన తండ్రిని కోల్పోయాడు. ఆ బాలుడు మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
తన తండ్రి మృతిచెందిన బాధను ఆవేదనగా వ్యక్తం చేసిన బాలుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ప్రజల ప్రాణాలతో రాజకీయం చేస్తారా? అంటూ ప్రశ్నించాడు. పహల్గామ్ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని, కానీ కేంద్రానికి కనీస అవగాహన లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి పర్యాటక ప్రాంతాల్లో ఆర్మీ నియమించడం అవసరమని ఆ చిన్నారి అన్నాడు. ప్రస్తుతం ఆ బాలుడి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంత చిన్న వయసులో ఆ అబ్బాయి మాటలు విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పిల్లాడి మాటలను విన్న కొందరు నెటిజన్లు పిల్లడు మాట్లాడిన తీరును ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన దేశ భద్రతపై కీలక ప్రశ్నలు రేకెత్తిస్తుండగా, చిన్న పిల్లడు మాట్లాడిన మాటలు అధికారులను స్పందించేలా చేస్తున్నాయి.