ఉగ్రవాదులను వేటాడి మట్టుబెట్టాలి..
పహల్గామ్ ఉగ్రదాడి భారత దేశంపై దాడిగా భావించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్ర వాదులకు కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇవ్వాలి అని కోరారు. జాతీయ భద్రతపై కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అన్నారు. ఉగ్రవాదులను వేటాడి మట్టుబెట్టేలా ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగించాలి అని ఆయన చెప్పుకొచ్చారు. ఉగ్రవాద సవాలును ఏకాభిప్రాయంతో పరిష్కరించడానికి, ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలి.. ఇది రాజకీయాలు చేయడానికి సమయం కాదని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.
అరుపులు, కేకలతో రచ్చ రచ్చ.. జైలులో హంగామా చేసిన అఘోరీ శ్రీనివాస్!
రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన అఘోరి శ్రీనివాస్, వర్షిణి కేసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరికి సంబంధించిన కేసులో అఘోరీ శ్రీనివాస్ ను అరెస్టు చేసిన పోలీసులు, ఆ తర్వాత రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనివాస్‌ను అరెస్టు చేసి కంది సబ్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే, కంది సబ్ జైలుకు తీసుకువచ్చినప్పుడు అఘోరి శ్రీనివాస్ అరుపులు, కేకలతో హంగామా చేశాడు. వర్షిణిని నా దగ్గరే ఉంచాలి.. అంటూ గట్టిగా అరుస్తూ జైలులో వీరంగం సృష్టించాడు. అఘోరి ప్రవర్తనను చూసి జైలు సిబ్బంది సైతం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.
‘‘ముస్లింలు బలహీనంగా ఉన్నారు, అందుకే ఉగ్ర దాడి’’.. ప్రియాంకా గాంధీ భర్త వివాదాస్పద వ్యాఖ్యలు..
పహల్గామ్ ఉగ్రదాడిపై యావత్ దేశం బాధతో ఉంటే, కొందరు నాయకులు మాత్రం రాజకీయాలు, హిందూ-ముస్లిం అంటూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. పహల్గామ్ దాడిని ప్రధాని నరేంద్రమోడీకి సందేశంగా ఆయన అభివర్ణించాడు. ‘‘ముస్లింలు బలహీనంగా ఉన్నారు’’ అనే వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన దాడిలో హిందువుల్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో మైనారిటీలు అసౌకర్యంగా, ఇబ్బందిగా భావిస్తు్న్నారు’’ అన్నారు. బీజేపీ ‘‘హిందుత్వ’’ మద్దతు దీనికి కారణం అని అన్నారు.
ఉప్పల్‌లో బట్టతల మీద వెంట్రుకలు మొలుపిస్తామని భారీ మోసం
ఉప్పల్ ప్రాంతంలో ఒక బట్టతల మీద వెంట్రుకలు మొలుస్తాయని చెప్పి ప్రజలను మోసగొట్టే ఘటన వెలుగు చూసింది. ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి, ఇంస్టాగ్రామ్ ద్వారా శరవేగంగా ప్రచారం చేసి, బట్టతల మీద వెంట్రుకలు మొలుస్తాయని వాగ్దానం చేశాడు. ఈ ప్రకటనతో బాధితులు పెద్ద సంఖ్యలో ఉప్పల్ భాగయత్ లోని శిల్పారామం వద్ద ఆయన ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద చేరుకున్నారు. సల్మాన్ తన స్వతంత్రంగా ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద బట్టతల మీద వెంట్రుకలు మొలుస్తాయని చెప్పి, ఒక్కొక్కరి వద్ద నుండి 700 రూపాయలు వసూలు చేశాడు. ఆయన, బట్టతల మీద షాంపూ వేసి, మూడు నెలల తర్వాత వెంట్రుకలు మొలుస్తాయని బాధితులకు చెప్పాడు. అయితే, ఈ మోసం ఫైగా మోసగొట్టిన వ్యక్తులు ఉప్పల్ పోలీసులు చట్టప్రకారం దర్యాప్తు ప్రారంభించారు.
భారీగా పాకిస్తాన్ సైన్యం మోహరింపు.. సరిహద్దు గ్రామాలు ఖాళీ..
పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ చంపేశారు. ఈ దాడిలో 28 మంది మరణించారు. దాడికి సంబంధించిన కార్యాచరణ మొత్తం దాయాది దేశం పాకిస్తాన్ జరిగినట్లు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. కరాచీ, పీఓకేలోని ముజఫరాబాద్‌తో దాడికి సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు.
నల్లపాడు పోలీస్ స్టేషన్ కు గోరంట్ల మాధవ్.. విచారించనున్న పోలీసులు..
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసుల విచారణ మొదలయ్యింది. పోలీసుల అదుపులో ఉన్న ఐ టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించిన ఘటనలో గోరంట్ల మాధవ్ పై కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ నగరంపాలెం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజులు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న గోరంట్ల మాధవ్ ను అక్కడనుంచి గుంటూరుకు తీసుకొచ్చారు.
కుల్గామ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్..
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో జరిగి ఉగ్రదాడి యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. అమాయకులైన పర్యాటకులు, ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) బాధ్యత ప్రకటించింది. ఈ దాడిలో 20కి పైగా మంది మరణించారు. ఈ విషాద ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని దేశం మొత్తం కోరుతోంది. మరోవైపు, ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్రం ప్రభుత్వం అత్యు్న్నత సమావేశాన్ని నిర్వహిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం కేసు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు
గత ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పై చేసిన వ్యాఖ్యలపై, ఆయన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో, బీజేపీ అధికారం చేపట్టినప్పుడు రిజర్వేషన్లను తొలగిస్తామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఆధారంగా, పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు ఆడియో, వీడియో క్లిప్స్ సమర్పించారు.
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ vs చెన్నమనేని రమేష్.. పౌరసత్వం వివాదంపై సీఐడీ విచారణ
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుపై సీఐడీ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు ఆయనను స్టేట్మెంట్ కోసం ఈరోజు విచారణకు పిలిపించారు. సీఐడీ డీఎస్పీ ఆయన స్టేట్మెంట్‌ను పూర్తిగా రికార్డ్ చేశారు. ఆది శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, చెన్నమనేని రమేష్ భారతదేశ పౌరసత్వం లేకపోయినప్పటికీ తప్పుడు పత్రాలను ఉపయోగించి పౌరసత్వం పొందారని ఆరోపించారు. ఈ అంశంపై గత 15 ఏళ్లుగా పోరాటం సాగించిన శ్రీనివాస్, ఇటీవల హైకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పును ప్రస్తావించారు. కోర్టు తేల్చిచెప్పినట్లు, రమేష్ భారతదేశ పౌరుడే కాదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఆది శ్రీనివాస్ తెలిపిన ప్రకారం, చెన్నామనేని రమేష్ తన తప్పును ఒప్పుకొని ఇప్పటికే ₹30 లక్షలు ప్రభుత్వానికి చెల్లించినట్టు పేర్కొన్నారు. అయితే, ఇది సరిపోదని పేర్కొంటూ, చట్టబద్ధంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులను కోరారు. ఇంకా, రమేష్ భారత పౌరుడే కానప్పుడు మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్ తీసుకుంటుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో తీసుకున్న జీతభత్యాలను ప్రభుత్వానికి తిరిగి చెల్లించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం, కేంద్ర ఎన్నికల సంఘం , కేంద్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకొని సమగ్ర విచారణ జరపాలని ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.