Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని శోకానికి గురి చేసింది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన టూరిస్టులపై ముష్కరులు కాల్పులు జరిపారు. పహల్గామ్‌లోని బైసరీన్ గడ్డి మైదానాల వద్ద ఈ ఘటన జరిగింది. ఆ దుశ్చర్యలో 27 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ విషాద సమయంలో భారత్‌కి అండగా నిలుస్తామని చెబుతున్నాయి.
Read Also: Danish Kaneria: ‘‘హిందువులే టార్గెట్’’.. పహల్గామ్ ఉగ్రదాడిపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్..
పహల్గామ్ ఉగ్రదాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధాని నరేంద్రమోడీలకు సంతాప సందేశం పంపారు. ‘‘ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి విషాదకర పరిణామాలపై హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. బాధితులు సాధారణ పౌరులు, వివిధ దేశాలకు చెందిన వారు. ఈ క్రూరమైన నేరానికి ఎటువంటి సమర్థన లేదు. దీని నిర్వాహకులు, నేరస్థులు తగిన శిక్షను ఎదుర్కొంటారని మేము ఆశిస్తున్నాము. ఉగ్రవాదంపై అన్ని రూపాల్లో పోరాడేందుకు భారత భాగస్వాములతో సహకరిస్తాము. మరణించిన వారికి హృదయపూర్వక సానుభూతి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’’ అని పుతిన్ తన సంతాప సందేశంలో చెప్పారు.
President of Russia Vladimir Putin extended condolences to President of India Droupadi Murmu and Prime Minister of India Narendra Modi over the tragic consequences of the terrorist attack in Pahalgam, Jammu and Kashmir.
He said, " Esteemed Mrs President, Esteemed Mr Prime…
— ANI (@ANI) April 22, 2025