Off The Record: అవునంటారు, కాదంటారు.. తెలుసంటారు, వెంటనేతెలియదంటారు. ఇక రాజకీయాలు చేయనంటారు, నిరంతరం అటెన్షన్ కోసం ఏదో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటారు. వ్యవసాయం చేసుకుంటానని వెళ్లిపోయిన ఆ నేత.. పొలిటికల్ రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నారా? లేక పాత పార్టీలో తనను ఇబ్బందిపెట్టిన వాళ్ళ మీద రివెంజ్ ప్లాన్ చేశారా? ఎవర్నో ఇరికించబోయి తానే ఇరుక్కుంటున్నారా? ఎవరా నాయకుడు? ఏంటా స్టోరీ?
Read Also: Shine Tom Chacko : షైన్ టామ్ చాకోకు భారీ ఊరట..
ఏపీ పాలిటిక్స్‌లో తాజా ట్రెండింగ్ లీడర్… వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని, ఇక తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాక… కాకినాడ పోర్టు కేసులో ఆయన ఏ2 గా కేసు ఫైల్ అయింది. దీంతో తాను రాజకీయాల్లో.. బయట ఉన్నా తనకు ఏ2 కామన్ అయిందనుకున్నారో… లేక పొలిటికల్ రీ ఎంట్రీని కన్ఫర్మ్ చేద్దామనుకుంటున్నారోగానీ… కానీ ఆ కేసు విచారణ మొదలైన నాటి నుంచి అటెన్షన్ తనవైపునకు ఉండేలా మాట్లాడుతున్నారాయన. పోర్ట్ కేసులో ఫస్ట్‌టైం సీఐడీ విచారణకు హాజరైనప్పుడు లిక్కర్ స్కాంపై హాట్ కామెంట్స్ చేశారు సాయిరెడ్డి. అక్కడి నుంచి కథలో కొత్త మలుపులు మొదలయ్యాయి. కాకినాడ పోర్టు వ్యవహారంలో తన పాత్ర లేదని, చేసిందంతా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అని చెప్పారాయన. అలాగే తన అల్లుడు శరత్ చంద్రారెడ్డి కంపెనీ విషయంలో కూడా జోక్యం చేసుకోనన్నారు. ఎవరికీ ఒక్క ఉద్యోగం కూడా అడగనన్నారు. ఆ తర్వాత టాపిక్‌ను పోర్ట్ నుంచి లిక్కర్వైపునకు మళ్ళించారాయన. ఆ కేసు దర్యాప్తును ఎట్నుంచి మొదలుపెట్టాలో అర్ధంగాక ప్రభుత్వం ఆలోచిస్తున్న టైంలో… సూత్రధారి.. పాత్రధారి మొత్తం అప్పటి వైసీపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ బాంబు పేల్చారు విజయసాయి.
Read Also: Sampath Nandi : అందుకే అక్కడ ఫస్ట్ నైట్ సీన్లు పెడుతా.. సంపత్ నంది క్రేజీ ఆన్సర్
అయితే, ఈ కేసులో ఇంతవరకు సాయిరెడ్డిని నిందితుడిగా పరిగణించాలని అనుకున్న సిట్… ఇకనుంచి సాక్షిగా పిలవాలనుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే.. ఈనెల 18న లిక్కర్ స్కాంపై విచారణకు హాజరయ్యారాయన. మద్యం స్కాం మొత్తాన్ని రాజ్ కేసిరెడ్డే నడిపించారని మరోసారి కుండ బద్ధలు కొట్టారు. అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదంటూనే… వారికి వ్యాపారం చేసుకోవటానికి 100 కోట్లు అప్పు ఇప్పించానని చెప్పుకొచ్చారు సాయిరెడ్డి. ఇక్కడే ఏదో తేడా కొడుతోందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. లిక్కర్ స్కామ్‌లో ఎవరినో ఇరికించబోయి తానే ఇరుక్కుంటున్నారా అన్న అనుమానాలను వ్యక్తం అవుతున్నాయట. అల్లుడు శరత్‌చంద్రారెడ్డి కంపెనీతో అస్సలు సంబంధాలు లేవని, ఆయన్ని ఒక్క ఉద్యోగం కూడా అడగలేదని గతంలో చెప్పిన సాయిరెడ్డి… తాజాగా లిక్కర్ వ్యవహారానికి వచ్చే సరికి వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి తానే అల్లుడికి చెప్పి వంద కోట్లు అప్పుగా ఇప్పించాలని అనడం ఏంటో అర్ధంకావడం లేదంటున్నారు. దీన్నిబట్టి సంబంధాలు ఉన్నట్టా? లేనట్టా అన్నది ఆయనకే తెలియాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎవరూ అడక్కున్నా…. లిక్కర్ స్కామ్ అంటూ మీడియా ముందు ఆయనే ఎందుకు ప్రస్తావించారన్నది ఇక్కడ క్వశ్చన్ అట.
Read Also: Supreme Court: మురికివాడలు కూల్చి విఐపిల కోసం రోడ్లు వేస్తారా..
ఇక, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఓ ఎంపీగా మాత్రమే ఉన్న సాయిరెడ్డి… ఏ అధికారంతో రెండుసార్లు మీటింగ్స్‌లో పాల్గొని లిక్కర్ పాలసీపై చర్చించారన్న ప్రశ్నలు వస్తున్నాయి. లిక్కర్ ఎపిసోడ్లో తనకే సంబంధం లేకుంటే… అరబిందో నుంచి వాళ్ళకు వంద కోట్ల రూపాయల అప్పు ఎలా ఇప్పించారు? అల్లుడి కంపెనీతో సంబంధాలు లేవంటారు, ఇటు ఆయన నుంచే లిక్కర్ వ్యాపారం కోసం వంద కోట్లు అప్పు ఇప్పించానంటారు. ఈ రెండిటికీ పొంతన కుదరడం లేదన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. అటు లిక్కర్ స్కాం మొత్తానికి కేంద్ర బిందువులా మారిన రాజ్ కేసిరెడ్డి కూడా తనపై వచ్చిన ఆరోపణలకు స్పందించారు. బట్టేబాజ్ సాయిరెడ్డి అంటూ ఘాటు పదజాలమే వాడారాయన. ఈ పరిస్థితుల్లో….అసలు సాయిరెడ్డి టార్గెట్ ఏంటి? పార్టీ నుంచి తనను పొమ్మనకుండా పొగ పెట్టిన వారిని టార్గెట్ చేయలనుకుంటున్నారా.. పొలిటికల్ రీఎంట్రీ కోసం చూస్తూ…. తనపై ఉన్న వైసీపీ ముద్రను తొలగించుకుని క్లీన్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారా? లేక ఏదో చేయాలనుకుని ఇంకేదో చేసేస్తున్నారా? ఎవర్నో ఇరికించబోయి తానే ఇరుక్కుంటున్నారా అన్న రకరకాల ప్రశ్నలు వస్తున్నాయట. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే కొద్ది రోజులు వేచా చూడాల్సిందేనంటున్నారు పొలిటికల్ పండిట్స్.