Mohan Bhagwat: హిందూ సమాజంలో కుల భేదాలు అంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. హిందువులకు ‘‘ఒక ఆలయం, ఒక బావి, ఒక శ్మశానవాటిక” అనే సూత్రాన్ని స్వీకరించడం ద్వారా సామాజిక సామరస్యం కోసం కృషి చేయాలని అన్నారు.
Read Also: MLC Kavitha : విప్లవాల జిల్లా ఖమ్మంలో కామ్రేడ్స్ మౌనం వహిస్తున్నారు
అలీఘర్‌లో 5 రోజుల పర్యటనలో ఉన్న మోహన్ భగవత్, హెచ్‌బీ ఇంటర్ కాలేజ్, పంచన్ నగ్రీ పార్క్‌లోని రెండు శాఖలలోని స్వయంసేవకులతో మాట్లాడారు. శాంతి కోసం భారత్ తన ప్రపంచ బాధ్యతను నెరవేర్చడానికి సామాజిక ఐక్యత సాధించడం చాలా ముఖ్యమని అన్నారు. హిందూ సమాజానికి పునాది సంస్కారం, విలువలు అని నొక్కి చెప్పారు. సంప్రదాయం, సాంస్కృతిక విలువలు, నైతిక సూత్రాలు కలిగిన సమాజాన్ని నిర్మించాలని అన్నారు. సమాజంలో అన్ని వర్గాలకు చేరువ కావాలని, అట్టడుగు స్థాయిలో సామరస్యం, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయడానికి వారిని ఇళ్లలోకి ఆహ్వానించాలని స్వయంసేవకుల్ని కోరారు.