హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. తాజాగా ఈ అంశంపై అజారుద్దీన్ స్పందించారు. ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
READ MORE: Canada: కెనడాలో రెచ్చిపోయిన ఖలిస్తానీలు.. గురుద్వారా ధ్వంసం..
ఇందులో ఎలాంటి కుట్రకోణం, స్వప్రయోజనాలు లేవని అజారుద్దీన్ అన్నారు. దీనిపై నేను ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేదన్నారు. ఆ స్థాయికి దిగజారాలని అనుకోవడం లేదని.. ఈ అసోసియేషన్‌ను చూసి క్రికెట్ ప్రపంచం నవ్వుతోందని విమర్శించారు. తన 17 ఏళ్ల క్రికెట్ కెరీర్ గురించి ప్రస్తావించారు. దాదాపు పదేళ్లపాటు టీమిండియా కెప్టెన్‌గా ఉన్నానని గుర్తు చేశారు. సారథిగా డిస్టింక్షన్‌లో పాసయ్యానన్నారు. హైదరాబాద్‌లో క్రికెటర్లను ఇలాగేనా గౌరవించేది? అని ప్రశ్నించారు. ఈ అంశంపై తప్పకుండా కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
READ MORE: Samantha : ఆ సినిమాలో దారుణంగా నటించా.. సమంత సంచలనం..