NDA Corporators: గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని గెలిచి సీఎం చంద్రబాబుకి పుట్టినరోజు కానుకగా ఇచ్చామని కూటమి కార్పొరేటర్లు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన డిప్యూటీ మేయర్ పై జరిగే అవిశ్వాస తీర్మానాన్ని కూడా మేమే గెలుచుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ పదవిని మేము అప్రజాస్వామ్యంగా లాక్కున్నాం అని వైసీపీ అంటుంది.. మేము రాజ్యాంగాన్ని కూనీచేశామని, మాకు నైతికత లేదంటున్నారు.. ఎవరికి నైతికత లేదో ప్రజలకి బాగా తెలుసు అని పేర్కొన్నారు. మీ ప్రభుత్వం హయంలో మీరు నైతికతను పాటించారా అని ప్రశ్నించారు. మీకు నైతికత కోసం మాట్లాడే హక్కు లేదు అని ఎన్డీయే కూటమి కార్పొరేటర్లు తెలిపారు.
Read Also: Top Headlines @1PM: టాప్ న్యూస్!
ఇక, మా కార్పొరేటర్లనీ బెదిరించి తమ పార్టీలోకి లాగేసుకుంటారనే ఉద్దేశంతోనే మా కార్పొరేటర్లను మలేషియా పంపించామని కూటమి కార్పొరేటర్లు చెప్పుకొచ్చారు. అంతేగానీ మేము వైసీపీ కార్పొరేటర్లని బెదిరించలేదు.. విశాఖ నగర అభివృద్ధిని ఆశించి మాతో వైసీపీ కార్పొరేటర్లు కలిసి వచ్చారు.. వైసీపీ హయంలో ఎన్నో దుర్మార్గాలకి తెగబడ్డారు.. వైసీపీ నేతలు అడ్డగోలుగా వందల కోట్లు సంపాదించుకున్నారు అని ఆరోపించారు. వైసీపీ పార్టీ దొంగలతో ఏర్పడిన పార్టీ అంటూ కూటమికి చెందిన కార్పొరేటర్లు మండిపడ్డారు.