20
April, 2025

A News 365Times Venture

20
Sunday
April, 2025

A News 365Times Venture

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Date:

‘‘హిందీ వివాదం’’.. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ కలిసే అవకాశం..

జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలు, హిందీ వివాదంపై తమిళనాడు, కర్ణాటక తర్వాత మహారాష్ట్రలోని పొలిటికల్ పార్టీలు కూడా ఈ వివాదంలో చేరాయి. మహారాష్ట్రంలో హిందీ వివాదం నేపథ్యంలో ఠాక్రే కుటుంబాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల మళ్లీ కలిసిపోయేందుకు మార్గం సుగమం అయింది. మరాఠీ గుర్తింపు, సంస్కృతికి ముప్పు ఉందనే ఆందోళనల మధ్య విడిపోయిన ఇద్దరు నేతలు నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. 2005లో ఠాజ్ ఠాక్రే సొంత పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) ఏర్పాటు తర్వాత ఠాక్రే కుటుంబం విడిపోయింది. శివసేన (UBT), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) లకు నాయకత్వం వహిస్తున్న ఇద్దరు నాయకులు వేర్వేరు కార్యక్రమాలలో మాట్లాడుతూ, మహారాష్ట్ర భాషా , సాంస్కృతిక ప్రయోజనాలు రాజకీయ శత్రుత్వాలకు అతీతమైనవని అన్నారు.

యోగి జీ ఇలాంటి వారిని అరికట్టండి.. భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య..

బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. భార్య, ఆమె తల్లిదండ్రుల వేధింపుల కారణంగా సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. గంటన్నర నిడివి ఉన్న వీడియో రికార్డ్ చేసి తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పాడు. అయితే, తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే యూపీ ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. భార్య, ఆమె తరుపు బంధువుల వేధింపులకు 34 ఏళ్ల వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఘజియాబాద్‌లోని మోడీనగర్ ప్రాంతానికి చెందిన మోహిత్ త్యాగి అనే ప్రైవేట్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. మోహిత్ సోదరుడు రాహుల్ త్యాగి, మోహిత్ భార్య భార్య ప్రియాంకా, ఆమె సోదరుడు పునీత్ త్యాగి, వదిన నీతు త్యాగి, మామలు అనిల్, విశేష్ త్యాగిల వేధింపుల కారణంగానే తన సోదరుడు మరణించాడని ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 10, 2020లో ప్రియాంకా అనే మహిళను మోహిత్ వివాహం చేసుకున్నాడు. ఇది మోహిత్‌కి రెండో వివాహం. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లయిన కొన్ని నెలల తర్వాత నుంచే వీరి మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి.

“మరాఠీ” తప్పనిసరి.. హిందీ వివాదంపై సీఎం ఫడ్నవీస్..

మహారాష్ట్రలో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) విధానంలో భాగంగా హిందీని బలవంతం చేస్తున్నారంటూ శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ రాజ్ ఠాక్రేలు మహరాష్ట్రలో వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ వివాదంపై శనివారం క్లారిటీ ఇచ్చారు. మరాఠీ అనేది చర్చనీయాంశమే కాదని, అందరూ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. వేరే భాషలు నేర్చుకోవడం వారి వ్యక్తిగత ఎంపిక అని చెప్పారు. హిందీ పట్ల వ్యతిరేకత, ఇంగ్లీష్ పట్ల పెరుగుతున్న ప్రాధాన్యతనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, మరాఠీకి ఎలాంటి సవాలు వచ్చిన సహించబోమని హెచ్చరించారు. ‘‘మహారాష్ట్రలో మరాఠీ భాష తప్పనిసరి, ప్రతి ఒక్కరూ దానిని నేర్చుకోవాలి. అదనంగా, మీరు ఇతర భాషలను నేర్చుకోవాలనుకుంటే, మీరు అలా చేయవచ్చు. హిందీ పట్ల వ్యతిరేకత, ఇంగ్లీష్‌కి సపోర్ట్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా మరాఠీని వ్యతిరేకిస్తే, దానిని సహించబోము’’ అని ఫడ్నవీస్ అన్నారు.

బీజేపీ నాయకులు ఈ దేశం కోసం చేసింది ఏమిటి..?

గాంధీ కుటుంబంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. దేశానికి త్యాగాలు చేసిన కుటుంబాన్ని “డూప్లికేట్ గాంధీ కుటుంబం” అంటూ మాట్లాడడం తగదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది. నెహ్రూ జైలు పాలయ్యారు, తన ఆస్తులన్నీ దేశం కోసం ధారపోశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు త్యాగం చేశారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని వదిలిపెట్టారు. రాహుల్ గాంధీ నిస్వార్థంగా దేశం కోసం పని చేస్తున్నారు. అలాంటి కుటుంబంపై అసభ్య వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం,” అని ఆయన అన్నారు.

కూటమి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది.. విశాఖ మేయర్‌ అంశంపై జగన్ ధ్వజం

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్.జగన్ ధ్వజమెత్తారు. విశాఖ మేయర్‌ అవిశ్వాస తీర్మానంపై ఎక్స్ ట్విట్టర్ వేదికగా జగన్ స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ గూండాయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌ పదవి నుంచి బీసీ మహిళను దించేయడం.. కూటమి సర్కార్ చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం అని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖ కార్పొరేషన్‌లో 58 స్థానాలను వైసీపీ గెలిచిందని గుర్తుచేశారు. టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచిందన్నారు. ఈ లెక్కల ప్రకారం మేయర్ పదవి కూటమి ప్రభుత్వానికి ఎలా వస్తుందని ప్రశ్నించారు. బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవ కులానికి చెందిన మహిళను మేయర్ సీటులో కూర్చోబెడితే కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి మేయర్ పదవిని లాక్కున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది? అని ప్రశ్నించారు.

జపాన్‌లో ఉద్యోగ అవకాశాలకు తెలంగాణ యువతకు వేదిక.. TOMCOM కీలక ఒప్పందాలు

తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా కీలక ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) రెండు ప్రముఖ జపాన్ సంస్థలతో కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది. టోక్యోలో అధికారిక పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రెవంత్ రెడ్డి సమక్షంలో, TERN (TGUK Technologies Pvt. Ltd.) , రాజ్ గ్రూప్ సంస్థలతో ఈ ఒప్పందాలపై TOMCOM అధికారికంగా సంతకాలు చేసింది. ఈ ఒప్పందాల ద్వారా జపాన్‌లో పెరుగుతున్న ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ నుండి నైపుణ్యం గల యువతిని నియమించేందుకు వీలవుతుంది. ఒప్పందాల ప్రకారం రాబోయే 1-2 సంవత్సరాలలో సుమారు 500 ఉద్యోగాల అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. వాటిలో.. హెల్త్‌కేర్ (కేర్‌గివింగ్) – 200 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్ (ఆటోమొబైల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్/ఐటీ) – 100 ఉద్యోగాలు.. హాస్పిటాలిటీ – 100 ఉద్యోగాలు.. కన్స్ట్రక్షన్ (సివిల్, బిల్డింగ్, మెంటెనెన్స్ తదితరాలు) – 100 ఉద్యోగాలు ఉన్నాయి.

ప్రస్తుతం కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయి

కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా తనపై మద్యం కేసు పెట్టారని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా శనివారం సిట్ అధికారుల ఎదుట మిథున్‌రెడ్డి హాజరయ్యారు. విచారణ ముగిసిన తర్వాత విజయవాడలో మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు మొదలయ్యాయని పేర్కొన్నారు. ‘‘మొదట మదనపల్లి ఫైల్స్ తగలబెట్టారన్నారు. తర్వాత మైన్స్‌లో దోచుకున్నారని ఆరోపణలు చేశారు. భూములు ఆక్రమించామన్నారు. ఎర్రచందనం తరలించామని ఆరోపణలు చేశారు.’’ ఆరోపణల్లో ఏవీ కూడా ప్రభుత్వం నిరూపణ చేయలేదని మిథున్‌రెడ్డి తెలిపారు. డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే మద్యం కేసు కూడా తప్పుడిదేనని చెప్పగలనన్నారు. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. న్యాయస్థానం ఈ కేసు గురించి తేల్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అంశంపై వివరంగా మాట్లాడతానని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని.. అందుకే ఈ కేసు గురించి పూర్తిగా మాట్లాడలేకపోతున్నట్లు చెప్పుకొచ్చారు.

బెదిరింపులతో విశాఖ మేయర్ పదవి దక్కించుకున్నారు

ప్రస్తుతంలో ఏపీలో నియంతృత్వ పాలనను చూస్తున్నామని వైసీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సజ్జల మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. విశాఖలో బలం లేకపోయినా బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసి విశాఖ మేయర్ పదవి దక్కించుకున్నారని మండిపడ్డారు. ఒక బీసీ మహిళ మేయర్‌గా ఉన్న చోట పదవి నుంచి తప్పించారన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ అధికార యంత్రాంగమే మాఫియా ముఠాలా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్ధను అడ్డుపెట్టుకుని బరితెగించి వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ సూచన మేరకే ఎంఐఎం సభ

జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ దూరంగా ఉండాలని బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతోపాటు ఎన్నికల్లో పోటీ చేయని కాంగ్రెస్ పైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు దూరంగా ఉండేది, ఓటింగ్ ను బహిష్కరించేది నక్సలైట్లు మాత్రమేనని అన్నారు. ఆ నక్సలైట్ల వారసులే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలని మండిపడ్డారు. అలాంటి పార్టీలను రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విప్ లకు భయపడి ఓటింగ్ కు దూరంగా ఉన్నా, మజ్లిస్ పార్టీని గెలిపించినా ఆయా పార్టీల కార్పొరేటర్ల రాజకీయ భవిష్యత్తు ఖతం కాబోతోందని హెచ్చరించారు. తెలంగాణలోని 85 శాతం హిందువులంతా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. విప్ లకు భయపడి నిర్ణయం తీసుకుంటారో, ఓటింగ్ కు హాజరై మజ్లిస్ ను ఓడిస్తారో తేల్చుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సూచించారు.

రేపటి నుంచి గుజరాత్‌లో నారాయణ బృందం పర్యటన

మంత్రి నారాయణ బృందం ఆది, సోమవారాల్లో గుజరాత్‌లో పర్యటించనుంది. అమరావతి నిర్మాణంలో భాగంగా పలు ప్రాంతాల్లో అధ్యయనానికి నారాయణ, అధికారులు వెళ్లనున్నారు. మంత్రి వెంట సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ ఛైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు వెళ్తున్నారు. ఇక పర్యటనలో భాగంగా ఆదివారం ఏక్తా నగర్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని మంత్రి నారాయణ, అధికారులు పరిశీలించనున్నారు. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం సర్దార్ పటేల్ విగ్రహం అధ్యయనం చేయనున్నారు. ఇక మధ్యాహ్నం అహ్మదాబాద్ శివారులో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని పరిశీలించనున్నారు. అహ్మదాబాద్‌లోని సీఈపీటీ యూనివర్సిటీ (సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ) సందర్శించనున్నారు. రేపు రాత్రికి అహ్మదాబాద్‌లో స్పోర్ట్స్ సిటీ పరిశీలించనున్నారు. ఎల్లుండి ఉదయం సబర్మతి రివర్ ఫ్రంట్‌ను మంత్రి బృందం పరిశీలించనుంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ponnam Prabhakar: త్వరలోనే ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్..

Ponnam Prabhakar: తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే...

Indravelli Martyrs Day: నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం.. మొదటిసారి అధికారికంగా..!

ఇంద్రవెల్లి నెత్తుటి గాయానికి నేటితో 44 ఏళ్లు. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించడంపై...

HCA: మరోసారి వార్తల్లో హెచ్‌సీఏ.. మహ్మద్‌ అజహరుద్దీన్‌ పేరు తొలగింపు!

ఇటీవలి కాలంలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) పేరు నిత్యం వార్తల్లో...

Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్లు వీరే!

యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసులో...