Betting Apps : క్యాసినో బెట్టింగ్ యాప్ కారణంగా ఓ యువకుడి జీవితం ఘోరాంతమైంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి నష్టపోయిన యువకుడు రాహుల్ చివరకు తన మిత్రుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. రాహుల్ తన బెట్టింగ్ పార్ట్‌నర్ అయిన శాఖమూరి వెంకటేశ్‌కు రూ.3 లక్షల వరకు లోన్ ఇచ్చాడు. అయితే డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగిన రాహుల్‌ను వెంకటేశ్ కిడ్నాప్ చేశాడు. అనంతరం నంద్యాల నుంచి రాహుల్‌ను తీసుకువచ్చి షాద్‌నగర్‌లో దారుణంగా హత్య చేశాడు.
Pakistan: బంగ్లాదేశ్ దారిలో పాకిస్తాన్.. కేఎఫ్‌సీ రెస్టారెంట్లపై దాడులు..
రాహుల్ మృతదేహాన్ని అనవాళ్లు లేకుండా చేసి దాచిన వెంకటేశ్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన షాద్‌నగర్ పోలీసులు, వారం రోజుల పాటు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి వెంకటేష్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. యువత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌లో మోజుపడి ఎలా ప్రమాదంలో పడుతున్నారు అన్నదానికి ఇది నిలువెత్తు ఉదాహరణగా మారింది.
Sajjala Ramakrishna Reddy: బెదిరింపులతో విశాఖ మేయర్ పదవి దక్కించుకున్నారు