ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నేడు రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రాజస్థాన్ జట్టు నుంచి సంజు శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. అతని స్థానంలో రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కాగా.. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్(3) మళ్లీ నిరాశ పర్చగా.. ఓపెనర్ ఐడెన్ మార్క్రామ్(66) దూకుడుగా ఆడాడు. ఆయుష్ బదోని(50) అద్భుతంగా రాణించాడు. అర్ధ శతకం చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. చివరల్లో అబ్దుల్ సమద్ నాలుగు సిక్సులు బాది 30 పరుగులు జోడించాడు.
READ MORE: Pakistan: బంగ్లాదేశ్ దారిలో పాకిస్తాన్.. కేఎఫ్‌సీ రెస్టారెంట్లపై దాడులు..
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నోకు శుభారంభం దక్కలేదు. మూడో ఓవర్లోనే జోఫ్రా ఆర్చర్.. మిచెల్ మార్ష్(4) వికెట్ పడగొట్టాడు. నికోలస్ పూరన్(11) పెద్దగా రాణించలేకపోయాడు. పురన్ పెవిలియన్‌కు చేరుకోగానే.. కెప్టెన్ పంత్ క్రీజ్‌లోకి ప్రవేశించాడు. రిషబ్ పంత్(3) ఎప్పటిలాగే నిరాశ పరిచాడు. ఐడెన్ మార్క్రామ్ మాత్రం అదరగొట్టాడు. 66 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 16 వ ఓవర్‌లో ఔట్ అయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన ఆయుష్ బదోని(50) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. చివరల్లో అబ్దుల్ సమద్(30) నాలుగు సిక్సులు బాది స్కోరు పెరుగుదలకు తోడ్పడ్డాడు. డేవిడ్ మిల్లర్ 7 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు.. వనిందు హసరంగా రెండు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.