Raj Kasireddy Sensational Audio: ఏపీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.. అయితే, లిక్కర్ స్కాంలో సిట్ అధికారుల నోటీసులపై వివరణ ఇస్తూ.. విజయసాయిరెడ్డిపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. లిక్కర్ స్కాం.. విజయసాయిరెడ్డిపై ఆడియో విడుదల చేసిన రాజ్ కసిరెడ్డి.. గత కొంతకాలంగా నాపై వస్తున్న తప్పుడు సమాచారం గురించి చెప్పాలని ఆడియో విడుదల చేస్తున్నాను. మార్చిలో సిట్ అధికారులు నేను లేని సమయంలో మా ఇంటికొచ్చి మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. నేను 24 గంటల్లోనే సిట్ అధికారులకు స్పందించాను.. నేను విచారణకు వస్తానని చెప్పా.. అయితే, వాళ్ల దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో ఇవ్వాలని అడిగా.. నాకు పూర్తి సమాచారం ఇస్తే విచారణకు వస్తానని చెప్పా.. అయితే, ఈమెయిల్ పెట్టాక నాకు మరోసారి నోటీసులు ఇచ్చారు.. ఈ రోజు నోటీసు ఇచ్చి.. రేపు విచారణకు హాజరుకావాలని సూచించారు..
Read Also: BJP MP: ‘‘సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంట్ మూసేయాలి’’.. వక్ఫ్ చట్టంపై బీజేపీ ఎంపీ..
ఇక, నాకు వచ్చిన సిట్ నోటీసులపై నేను నా లాయర్లను సంప్రదించాను.. మిమ్మల్ని ఈ కేసులో సాక్షిగా పిలిచినప్పటికీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని మా లాయర్లు చెప్పారని తెలిపారు రాజ్ కసిరెడ్డి.. అందుకే కోర్టు ద్వారా ప్రొటెక్షన్ తీసుకుని సిట్ విచారణకు హాజరవుతాను అన్నారు. సిట్ నోటీసులపై హైకోర్టుకు వెళ్లానని తెలిపిన ఆయన.. హైకోర్టు కొంత సమయం ఇచ్చి నన్ను పిలవమని చెప్పిందన్నారు.. మరోవైపు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా.. న్యాయపరమైన రక్షణ వచ్చాక విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.. ఇక, విజయసాయిరెడ్డి కామెంట్లపై కౌంటర్ ఎటాక్‌కు దిగుతూ.. న్యాయపరమైన వ్యవహారాలు ముగిశాక విజయసాయిరెడ్డి బాగోతం బయటపెడతానని పేర్కొన్నారు కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి..