గురుగ్రామ్ హాస్పిటల్ ఐసీయూలో ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని బధౌలి గ్రామానికి చెందిన నిందితుడు దీపక్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని ఒక ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఒక మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేయడానికి 8 బృందాల సహాయంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగంలోకి దిగింది.
Also Read:RCB vs PBKS : భారీ వర్షం.. బెంగళూరు, పంజాబ్ మ్యాచ్ జరిగేనా?
ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 800 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సిట్ విశ్లేషించిందని, ఆసుపత్రి సిబ్బందితో విచారణ నిర్వహించిందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న 25 ఏళ్ల వ్యక్తి గత ఐదు నెలలుగా ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడని వెల్లడించారు. ఏప్రిల్ 6న గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని ఒక ఎయిర్ హోస్టెస్ ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read:Google: గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం.. లక్షలాది స్మార్ట్‌ఫోన్‌లపై ప్రభావం!
తన అనారోగ్యం కారణంగా ఆ వ్యక్తిని అడ్డుకోలేకపోయానని ఆ మహిళ చెప్పింది. ఆ సమయంలో ఇద్దరు నర్సులు అక్కడ ఉన్నారని, ఆ ఘోరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని కూడా ఆమె పేర్కొంది. ఏప్రిల్ 13న ఆసుపత్రి నుంచి విడుదలైన తర్వాత తన భర్తకు జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే భర్త పోలీసులను ఆశ్రయించాడు. 46 ఏళ్ల మహిళ ఫిర్యాదుతో ఏప్రిల్ 14న సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు.