19
April, 2025

A News 365Times Venture

19
Saturday
April, 2025

A News 365Times Venture

AP Liquor Scam: లిక్కర్‌ స్కాంపై సిట్‌ ఫోకస్‌.. మరికొన్ని పేర్లు బయటపెట్టిన సాయిరెడ్డి..!

Date:

AP Liquor Scam: ఏపీలో లిక్కర్ స్కాంపై సిట్ లోతైన విచారణ చేపడుతోంది. ప్రధానంగా లిక్కర్ స్కాం వెనుక ఎవరెవరు ఉన్నారు, లిక్కర్ డిస్టలరీస్ దగ్గర ముడుపులు ఎవరి నుంచి ఎవరికి చేరాయి, లిక్కర్ సేల్స్ లో ఎలా స్కామ్‌కు పాల్పడ్డారనే అనే అంశాలపై ప్రధానంగా సిట్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే సిట్ కీలక విషయాలను సేకరించింది. ఆ తర్వాతే వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టింది..

లిక్కర్ స్కాం విచారణలో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన సిట్.. ప్రధానంగా స్కాం వెనుక ఎవరు ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు విచారణ జరిపినట్టు తెలుస్తోంది. ఇంత పెద్ద స్కాంకు సంబంధించి ఎవరు ఉన్నారనే విషయాన్ని స్టేట్‌మెంట్ రూపంలో తీసుకునేందుకు సిట్ లోతైన విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది. స్కాంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి వెనుక ఎవరున్నారు, ఎవరు అండతో రాజ్ కసిరెడ్డి ఈ వ్యవహారాలు నడిపారనే విషయాలను తెలుసుకోవటంపై సిట్ ఫోకస్ పెట్టింది. లిక్కర్ స్కాంలో ముడుపులు ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయనే విషయాలను కూడా తెలుసుకోవటంపై ప్రధానంగా సిట్ విచారణ జరుగుతోంది. లిక్కర్ మీటింగ్ లో ఏ విషయాలు చర్చించారనేది తెలుసుకోవటం ద్వారా ఇంకా ఎవరెవరి పాత్ర అందులో ఉన్నారనే విషయాలను తెలుసుకోవటంపై సిట్ విచారణ జరుపుతోంది.

బెల్టు షాపులకు అనధికారికంగా మద్యం అమ్మకాలు జరపటం, అలా జరిగిన అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు కొల్లగొట్టారనే దానిపై సిట్ విచారణ జరుపుతోంది. లిక్కర్ స్కాంలో ముడపులు వసూలుకోసం హవాలా నెట్ వర్క్ ఉందనే విషయాన్ని సిట్ ఇప్పటికే గుర్తించింది. దీంతో దీనిలో పాత్రదారుల కనుక్కునేందుకు సిట్ విచారణ ముమ్మరం చేసింది. రాష్ట్రాల మధ్య సేల్ డ్యూటీ లేకుండా అమ్మకాలు జరపకుండా సొమ్ము పక్కన పెట్టే అంశానికి సంబంధించి కూడా సిట్ విచారణ ముమ్మరం చేసింది. విజయసాయి రెడ్డి సిట్ విచారణలో కీలక విషయాలను వెల్లడించటం ద్వారా సిట్ కు మరింత బలం చేకూరినట్టుగా తెలుస్తోంది. గతంలో ప్రకటించిన విధంగానే ఇప్పుడు కూడా విజయసాయిరెడ్డి లిక్కర్ వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించారనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే లిక్కర్ బిజినెస్ కోసం రెండు మీటింగ్స్ తన వద్ద జరిగాయని అందులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్ రెడ్డి, కసిరెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారని క్లారిటీ ఇచ్చారు.

కసిరెడ్డి 3 కంపెనీలను తీసుకుని కొత్త బ్రాండ్స్ అందులో తయారు చేసి బెల్టు షాపులకు అమ్మకాలు జరపారా? అనే విషయాన్ని అడిగారని చెప్పారు. మిథున్ రెడ్డికి ఇందులో పాత్ర ఉందా లేదా అనే విషయం తనకు తెలియని చెప్పారు విజయసాయిరెడ్డి. లిక్కర్ స్కాం జరిగిందా లేదా అనే విషయం రాజ్ కసిరెడ్డికి మాత్రమే తెలుసు. స్కాం వెనుక బిగ్ బాస్ ఉన్నారా లేరా కూడా తెలియదన్నారు విజయసాయిరెడ్డి. లిక్కర్ స్కాంలో పాత్రదారులుగా మరికొన్ని పేర్లను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాజ్ కసిరెడ్డితో పాటు ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి, చాణక్య రాజ్ , కిరణ్, సుమిత్, సైఫ్ అనే వ్యక్తులతోపాటు మరికొందరు వ్యక్తులు ఈ వ్యవహారంలో ఉన్నారని సిట్ కు విజయ్ సాయిరెడ్డి చెప్పారు. ఇదే విషయాలను వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ గతంలోనే స్టేట్ మెంట్ ఇచ్చారు. అదే విషయాన్ని నేను కూడా సిట్ ముందు చెప్పానని తెలిపారు. విజయసాయిరెడ్డి. లిక్కర్ వ్యవహారంలో జరిగిన కీలక పరిణామాలను అన్నిటి గురించి సిట్ కు వివరించిన విజయసాయిరెడ్డి తన పాత్ర ఏమీ లేదనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఇప్పటికే సిట్ సేకరించిన సమాచారానికి విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం అదనపు బలాన్న చేకూర్చినట్టైందని సమాచారం. మిథున్ రెడ్డి పాత్ర, రాజ్ కసిరెడ్డి పాత్రలను వారి ద్వారానే తెలుసుకోవాలని విజయసాయిరెడ్డి చెప్పటం ద్వారా విచారణ ఇంకా మిగిలే ఉందనే సంకేతాలు ఇచ్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

RR vs LSG: మెరిసిన ఐడెన్ మార్క్రామ్, బదోని.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 181

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నేడు రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, లక్నో...

Actor Ali: అలీకి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు

మన దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో నటించిన ప్రముఖ నటుడు అలీ,...

Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 90 మంది మృతి

హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా...

GT vs DC: వాహ్.. ఢిల్లీ బ్యాటర్ల సమష్టి కృషి.. .. గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 204

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-35లో గుజరాత్ టైటాన్స్...