26
March, 2026

A News 365Times Venture

26
Thursday
March, 2026

A News 365Times Venture

HP Omen Max 16: HP నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ విడుదల.. రూ. 10 వేల క్యాష్ బ్యాక్

Date:

గేమింగ్ లవర్స్ కు మరో కొత్త ల్యాప్ టాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ హెచ్ పీ గేమింగ్ ల్యాప్‌టాప్ HP Omen Max 16 ను భారత్ లో విడుదల చేసింది. మెస్మరైజ్ చేసే ఫీచర్లతో వచ్చిన ఈ ల్యాప్ టాప్ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ ల్యాప్‌టాప్ శక్తివంతమైన పనితీరు కోసం 24-కోర్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌తో వస్తుంది. 32GB వరకు DDR5 RAMతో అనుసందానించారు. ఇది Nvidia GeForce RTX 5080 GPU, 1TB SSD స్టోరేజ్ ను కలిగి ఉంది.

Also Read:Supreme Court : డ్రైవర్ల పనిగంటలపై ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

HP ఒమెన్ మ్యాక్స్ 16.. 16-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 240Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ల్యాప్‌టాప్ Wi-Fi 7 కనెక్టివిటీని అందిస్తుంది. 330W పవర్ అడాప్టర్‌తో వస్తుంది. ఇది 30 నిమిషాల్లో ల్యాప్ టాప్ ను 50 శాతం వరకు ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో HP Omen Max 16 ప్రారంభ ధర రూ.3,09,999. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ షాడో బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.

Also Read:SIT Notice to MP Mithun Reddy: ఎంపీ మిథున్‌రెడ్డికి సిట్‌ నోటీసులు.. హైకోర్టులో ఊరట..!

దీనిని అమెజాన్, HP ఆన్‌లైన్ స్టోర్ నుంచి కొనుగోలు చేయవచ్చు. HP ఆన్‌లైన్ స్టోర్‌లో నో-కాస్ట్ EMI చెల్లింపు ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా కొనుగోలుదారులు రూ. 10,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్ బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, SBI, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డులపై చెల్లుతుంది.

Also Read:Meenakshi Natarajan : కుంభమేళాలో కుల వివక్ష చూపించారు.

HP ఒమెన్ మ్యాక్స్ 16 స్పెసిఫికేషన్లు

HP ఒమెన్ మ్యాక్స్ 16 విండోస్ 11 ముందే ఇన్‌స్టాల్ చేయబడి వస్తుంది. ఒమెన్ AI ఆప్టిమైజేషన్ల బీటా వెర్షన్‌తో వస్తుంది. ఇది 16-అంగుళాల WQXGA (2,560×1,600 పిక్సెల్స్) IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ 32GB DDR5 RAMతో జత చేయబడిన 24-కోర్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 275HX CPU ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో 16GB GDDR7 మెమరీతో Nvidia GeForce RTX 5080 GPU ఉంది. స్టోరేజ్ కోసం 1TB SSD అందుబాటులో ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 7, బ్లూటూత్ 5.4, రెండు థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లు, రెండు USB టైప్-A పోర్ట్‌లు, ఒక HDMI 2.1 పోర్ట్, ఒక ఈథర్నెట్ పోర్ట్, ఒక కాంబో ఆడియో జాక్ ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లో 1080p IR కెమెరా, డ్యూయల్ అరే డిజిటల్ మైక్రోఫోన్ కూడా ఉన్నాయి. HP ఒమెన్ మ్యాక్స్ 16.. 6-సెల్ 83Wh లి-అయాన్ బ్యాటరీతో వస్తుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Story Board : ట్రంప్ భారత్ కొంపముంచాడా? కొవిడ్ పరిస్థితులు మళ్లీ వస్తాయా ?

అమెరికా-ఇరాన్‌ యుద్దం…భారత్‌ కొంప ముంచుతోందా ? కరోనా పరిస్థితులు దేశంలో వచ్చే...

Bank Holidays: బ్యాంకులకు వరుస సెలవులు.. వరుసగా మూడు రోజులు.

వరుస సెలవుల కారణంగా వచ్చే వారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు మూడు...

Iran War: ఇరాన్‌ను లొంగదీయడానికి ట్రంప్ ముందు 4 మార్గాలు.

Iran War: ఇరాన్‌ను చావు దెబ్బతీయడానికి అమెరికా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. యుద్ధం...

Bengaluru Crime: మహిళ, ఆమె సోదరుడి హత్య.. ప్రేయసి కుమారుడే నిందితుడు..

Bengaluru Crime: వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. బెంగళూర్‌లో ఒక...