రేపు ఈ మండలాల్లో భూ భారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
తెలంగాణ భూ భారతి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, దీని ప్రయోజనం రాష్ట్రంలో భూ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించడం , రైతులకు, పర్యావరణానికి అనుకూలంగా భూముల వినియోగాన్ని ప్రోత్సహించడం. ఈ కార్యక్రమం, తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్, భూమి చట్టాలు, ఆస్తి హక్కుల పునరుద్ధరణ వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తుంది. భూ భారతి కార్యక్రమం ద్వారా, ప్రభుత్వమే భూముల ఖాతాలు, రికార్డులను సరికొత్తగా సృష్టించి వాటి మాలికల హక్కులను సులభంగా ప్రజలకు అందించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది రైతులకు భూములపై అనువైన పర్యవేక్షణను, కరెంట్ పొదుపు, పర్యావరణ పరిరక్షణ అంశాలు వంటి వాటిపై అవగాహన కూడా పెంచుతుంది.
మార్క్ శంకర్ పై అనుచిత వ్యాఖ్యలు.. అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్..!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన వ్యక్తులను పట్టుకున్నారు గుంటూరు పోలీసులు.. కర్నూలు జిల్లాకు చెందిన రఘు అలియాస్ పుష్పరాజ్.. ట్విట్టర్ వేదికగా ఈ పోస్ట్ చేసినట్టు గుర్తించామని తెలిపారు ఎస్పీ సతీష్‌కుమార్.. నిందితుడు రఘు మహిళలపై కూడా చాలా అసభ్యకరమైన పోస్టింగ్‌లు చేసినట్టు.. అతడి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తే స్పష్టం అవుతుందన్నారు.. ఇక, నిందితుడు రఘు.. హీరో అల్లు అర్జున్ ఫ్యాన్ అని తెలిపారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా పోస్టుల వార్ మధ్యలో.. రఘు అసభ్యకరమైన పోస్టు పెట్టినట్టు గుర్తించామని వెల్లడించారు..
ఐపీఎల్ 2025లో ఫిక్సింగ్ ముప్పు.. హైదరాబాద్ వ్యాపారవేత్తపై బీసీసీఐ అలర్ట్
ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో ఒక షాకింగ్ వార్త క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక బడా వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నిస్తున్నాడని, దీనిపై అన్ని ఐపీఎల్ జట్లను అప్రమత్తం చేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) హెచ్చరిక జారీ చేసింది. ఈ వ్యాపారవేత్త ఐపీఎల్ జట్ల యజమానులు, ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లను కూడా టార్గెట్ చేస్తూ అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయడానికి ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని బీసీసీఐ యాంటీ-కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ACSU) గుర్తించింది.
నివేదికల ప్రకారం, ఈ హైదరాబాద్ వ్యాపారవేత్తకు బుకీలు.. బెట్టింగ్ సిండికేట్‌లతో సంబంధాలు ఉన్నాయని, గతంలో కూడా అతడు అవినీతి కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు రికార్డులు ఉన్నాయని ACSU హెచ్చరించింది. అతడు తనను తాను ఒక సామాన్య అభిమానిగా పరిచయం చేసుకుంటూ… ఖరీదైన బహుమతులు, ఆభరణాలు, లగ్జరీ సౌకర్యాలతో ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఆశ్చర్యకరంగా, ఈ వ్యక్తి ఆటగాళ్ల కుటుంబ సభ్యులను, జట్టు యజమానులను, విదేశాల్లో నివసిస్తున్న వారి బంధువులను కూడా సోషల్ మీడియా ద్వారా సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పర్యావరణ విధ్వంసానికి న్యాయవ్యవస్థ గట్టి బుద్ధి చెప్పింది
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణాన్ని ఎలా అణిచివేస్తుందో, అది ఎంత భయానకంగా, బాధ్యతారాహిత్యంగా సాగుతోందో ఇప్పుడు దేశానికి, ప్రపంచానికి తేటతెల్లమైందని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో సుప్రీం కోర్టులో జరిగిన వాదనలు, ప్రభుత్వ నైపుణ్యానికి బదులుగా నిరంకుశత్వాన్ని ఉద్ఘాటించాయని ఆయన అన్నారు.
సెలవు దినాల్లోనూ ప్రభుత్వ యంత్రాంగం బుల్‌డోజర్లతో భూవిధ్వంసానికి పాల్పడడంపై సుప్రీంకోర్టు చేసిన గంభీర వ్యాఖ్యలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాంటి విషయమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. “బాధ్యత గల ప్రభుత్వం ఎలా ఉండాలో మరిచిపోయిన ఈ ప్రభుత్వానికి ఇది గుణపాఠంగా నిలుస్తుంది” అని ఆయన అన్నారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC) రూపొందించిన నివేదిక, ఈ భూములపై జరిగిన విధ్వంసానికి శాస్వత సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. వంద ఎకరాల అడవిని ధ్వంసం చేసిన ప్రభుత్వంపై, ఈ ప్రాంతాన్ని ఎలా పునరుద్ధరిస్తారో అడిగిన సుప్రీంకోర్టు ప్రశ్న ఆహ్వానించదగ్గ పరిణామం అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ అవసరాలను అధిగమిస్తాం.. గ్రీన్ ఎనర్జీవైపు ప్లాన్ చేస్తున్నాం
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ రూరల్ డెవలప్మెంట్ సంస్థలో TG REDCO తో రెండు సంస్థలు ఎంఓయూ చేసుకున్నాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సన్ పేట్రో 20 వేల కోట్ల పెట్టుబడి పెట్టారని, రెండు కంపెనీలు 27 వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారన్నారు. సీఎం దావోస్ పర్యటనలో ఈ ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు.
అమరావతిలో రూ.4,668 కోట్లతో ఐదు టవర్లు.. టెండర్లు పిలిచిన సీఆర్డీఏ..
రాజధాని అమరావతి నిర్మాణంపై వేగంగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం.. వచ్చే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నారు.. మరోవైపు.. ఎంపిక చేసిన పనులకు టెండర్లు పిలుస్తోంది సీఆర్డీఏ.. రాజధానిలో సచివాలయ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు సీఆర్డీఏ అధికారులు.. సచివాలయానికి 4 టవర్లు, హెచ్‌వోడీ కార్యాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచారు.. హెచ్‌వోడీ టవర్ నిర్మాణానికి రూ.1,126 కోట్లకు టెండర్ పిలిచిన అధికారులు.. సచివాలయానికి సంబంధించిన 1, 2 టవర్ల కోసం రూ.1,897 కోట్లతో మరో టెండర్‌కు పిలిచారు.. ఇక, సచివాలయం 3,4 టవర్ల కోసం రూ.1,664 కోట్లతో టెండర్లు జారీ చేశారు సీఆర్డీఏ అధికారులు.. మొత్తంగా 5 టవర్లను రూ.4,668 కోట్ల వ్యయంతో చేపట్టనుంది సీఆర్డీఏ.. మరోవైపు.. మే 1వ తేదీన సచివాలయ, హెచ్‍వోడీ టవర్లకు టెక్నికల్ బిడ్లు తెరవనుంది సీఆర్డీఏ..
మోసపోయా.. ఛాంబర్ ముందుకు హనుమాన్ నిర్మాత!
నిరంజన్ రెడ్డి, ప్రముఖ నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక పరిచయం అవసరం లేని వ్యక్తి. నిజానికి, “హనుమాన్” సినిమాకు ముందు ఆయన “బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్” అనే సినిమాను నిర్మించారు. అయితే, “హనుమాన్” సినిమాతో ఆయనకు విశేషమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత, ఆయన “డార్లింగ్” సినిమాను నిర్మించి, “డబుల్ ఇస్మార్ట్” సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. అయినప్పటికీ, ఆయన్ను ఎక్కువ మంది “హనుమాన్” నిర్మాతగానే గుర్తిస్తారు. ప్రస్తుతం, నిరంజన్ రెడ్డి సాయిధరమ్ తేజ్ హీరోగా “సంబరాల ఏటిగట్టు”, కిచ్చా సుదీప్ హీరోగా “బిల్లా రంగ బాష” అనే మరో సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, ఆయన ప్రశాంత్ వర్మ, పూరి జగన్నాథ్, ఛార్మీతో సహా కొందరు తనను మోసం చేశారని భావించి, ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
మంట కలిసిన మానవత్వం.. ఆస్తి పంచలేదని తండ్రికి కొరివి పెట్టని కొడుకు..!
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) తన జీవితం అంతా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించారు. సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి, పిల్లల పెళ్లిళ్లు చేశాడు. భార్యను కోల్పోయిన అనంతరం, మిగిలిన జీవితాన్ని తన పిల్లల మధ్య సంతృప్తిగా గడపాలని కోరుకున్నాడు. తనకు ఉన్న ఆస్తిలో కొడుకు గిరీష్‌కు 15 ఎకరాల వ్యవసాయ భూమిని, రూ.60 లక్షల నగదును ఇచ్చాడు. అయితే, మహబూబ్ నగర్‌లో ఉన్న ఇంటిని మాత్రం తన ఇద్దరు కుమార్తెల పేరుపై రిజిస్టర్ చేశాడు.
అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం అర్థరాత్రి మాణిక్యరావు తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే కుమార్తెలు హైదరాబాద్‌లో ఉన్న తమ అన్నయ్య గిరీష్‌కు సమాచారం ఇచ్చారు. కానీ అతడు తండ్రి అంత్యక్రియలకు రావడానికి నిరాకరించాడు. కారణం.. ఆ ఇల్లు తనకు ఇవ్వలేదన్న కోపం. “ఇంటిని నాకు ఇవ్వలేదు కదా, అంత్యక్రియలకు రాను” అంటూ తేల్చి చెప్పాడట.
వారికి గుడ్‌న్యూస్.. మరో 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల ప్రకటన..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వస్తున్నారు.. నామినేటెడ్ పోస్టుల్లో సింహ భాగం తెలుగుదేశం పార్టీ నేతలకు.. ఆ తర్వాత జనసేన నేతలకు.. కొన్ని భారతీయ జనతా పార్టీ నేతలకు కేటాయిస్తున్న విషయం విదితమే కాగా.. తాజాగా, 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది టీడీపీ.. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా నేతలు చెబుతున్నారు.. ప్రకటించిన 30 ఏఏంసీ చైర్మన్ల పదవుల్లో 25 టీడీపీ, 4 జనసేన, 1 బీజేపీ నాయకులకు దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటిస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు..
విద్యార్థుల మధ్య కుల వివక్ష.. మంచి బుద్ధి చెప్పాల్సిన ఉపాధ్యాయుడే..!
వసతి గృహాల్లో విద్యార్థులకు విద్య బుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులు కుల వివక్షత చూపిస్తున్నారంటూ ఒక బాలిక సెల్ఫీ వీడియో పంపించడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం రేకెత్తిస్తుంది. తమకు ఈ పురుష ఉపాధ్యాయులు వద్దంటూ మహిళల్ని నియమించాలని కన్నీళ్ళతో వేడుకుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామచంద్రుని పేట ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో లంబాడి సామాజిక వర్గానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు కులం పేరుతో తమను దూషిస్తున్నాడు అంటూ లంబాడి సామాజిక వర్గాన్ని విద్యార్థులను ప్రోత్సహిస్తూ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులను వేధిస్తున్నాడంటూ ఆ వీడియోలో బాలిక వాపోతున్నది.