Kishan Reddy : తెలంగాణ రాష్ట్రాన్ని భూములు, మద్యం అమ్మకాలతో నడిపించాలనే తపనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, “ఇంట్లో చెట్టు కాటానికే జీహెచ్‌ఎంసీ అనుమతి అవసరం అయితే, హెచ్‌సీయూలో ఉన్న చెట్లను ఎవరి అనుమతితో నరికి వేశారు?” అంటూ ప్రశ్నించారు. కన్జర్వేషన్ యాక్ట్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూముల అమ్మకాలే ప్రధాన ఆదాయ వనరుగా మలచుకుంటోందని విమర్శించారు. మరోవైపు, బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనూ భూములు అమ్మలేదని స్పష్టంగా పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం త్వరలో జరుగుతుందని పేర్కొన్న కిషన్‌రెడ్డి, “మీడియా దీనిపై ఎక్కువ ఆసక్తి చూపుతోంది. కానీ బీజేపీ అన్ని కార్యక్రమాలు పద్ధతిగా, సమగ్రంగా కొనసాగుతోంది,” అని అన్నారు.
ఏఐడీఎంకేతో బీజేపీకి గతంలో ఉన్న పొత్తును ఇప్పుడు పునరుద్ధరించామని తెలిపారు. అన్నామలైకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పిస్తారని అన్నారు. వక్ఫ్ చట్టంపై జరుగుతున్న దుయ్యబాట్లను ఖండించిన కిషన్‌రెడ్డి, “ఈ చట్టం పేద ముస్లింలకు న్యాయం చేసేలా ఉంది. భూ బకాసురులకు మాత్రం ఇది నచ్చడం లేదు,” అన్నారు. వక్ఫ్ బోర్డు నిర్ణయాలను కోర్టులో వివాదాస్పదం చేయడానికి అవకాశం కల్పించామని చెప్పారు. వక్ఫ్ ఆదాయాన్ని సమర్థంగా వినియోగించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందనే నమ్మకం తమకు ఉందని తెలిపారు. పాతబస్తీల్లో హిందువుల కాలనీలు నెమ్మదిగా ఖాళీ అవుతున్నాయన్న విషయం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
Bandi Sanjay : దుబాయిలో తెలంగాణ వాసుల హత్యపై కేంద్ర మంత్రి ఆరా