మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే గోలు శుక్లా కుమారుడు రుద్రాక్ష శుక్లా రెచ్చిపోయాడు. దేవాస్‌లోని ఒక కొండపై ఉన్న ప్రసిద్ధ మాతా టేక్రీ ఆలయాన్ని మూసేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో వచ్చి పూజారిపై దాడి చేశాడు. ఏడు కార్లలో వచ్చిన ఓ గుంపు.. ఆలయాన్ని తెరవాలంటూ అర్చకుడిపై ఒత్తిడి చేశారు. అందుకు ససేమిరా అనడంతో పూజారిపై దాడికి పాల్పడ్డారు. గత వారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఇది కూడా చదవండి:AP Cabinet Key Decision: 24 అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. రెండు ఎస్‌యూవీ వాహనాలతో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించినట్లుగా రికార్డైంది. బలవంతంగా ఆలయాన్ని తెరిపించేందుకు ప్రయత్నించారు. కానీ పూజారి అంగీకరించలేదు. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు దుద్రాక్ష శుక్లా సహా మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు. సోమవారం రాత్రి రుద్రాక్ష శుక్లాతో సహా మరో ఎనిమిది మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు అధికారి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Sunil Balusu: టాలీవుడ్ నిర్మాతలపై ఓటీటీ పెత్తనం.. యంగ్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
ఎఫ్‌ఐఆర్‌లో జితు రఘువంశీ పేరు ఉందని, రుద్రాక్ష్ శుక్లా, అమన్, లోకేష్, మనీష్, అనిరుద్ధ, హనీ, సచిన్, ప్రశాంత్ పేర్లను సోమవారం చేర్చారని అధికారి చెప్పారు. ఇక ఏడు వాహనాల్లో నాలుగు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.