కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశం అయ్యారు. కలెక్టర్ల పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇంకా చాలా మంది రెగ్యులర్ వర్క్ షీట్ పంపడం లేదు.. క్షేత్ర స్థాయికి వెళ్ళడం లేదు.. పని తీరు మార్చుకోవడం లేదు.. అలాంటి వాళ్ళు.. సీఎస్ నీ కలిసి మేము గ్రౌండ్ వర్క్ చేయలేం అని రిపోర్ట్ చేయండి ఏసీ కింద పని చేస్తాం అంటే.. ఇక్కడ పోస్టింగ్ ఇస్తాం.. మీరేం చేస్తున్నారు అనేది మా దగ్గర సమాచారం ఉంది..
Also Read:Dhanush : విజిల్ వేస్తూ ధనుష్ మాస్ స్టెప్పులు.. పోస్టర్ తో అప్డేట్
ఇకపై డైలీ సీఎంఓకి మీ వర్క్ పర్ఫార్మెన్స్ పంపండి.. చాలా సార్లు చెప్పినా… కొందరు మారడం లేదు.. రోజు రెండు మండలాలు తిరిగి రెవెన్యూ సదస్సులు పెట్టండి.. త్వరలో కలెక్టర్ లతో సీఎం వన్ టు వన్ సమావేశాలు ఉంటాయని తెలిపారు. భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, తాగు నీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యం సహించం.. ఎక్కడా లోపాలు జరగకుండా చర్యలు తీసుకోండి.. భూ భారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలి.. జిల్లాలోని ప్రతీ మండలంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులకు కలెక్టర్లు హాజరు కావాల్సిందే.. చట్టంపై ప్రజలకు సరళంగా వివరించాలని ఆదేశించారు.