19
April, 2025

A News 365Times Venture

19
Saturday
April, 2025

A News 365Times Venture

Crime News: 6 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన మామ.. కారు డిక్కీలో మృతదేహాం

Date:

Crime News: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దుర్గ్‌లో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలికపై మామ అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని పొరిగింటి వారి కారు డిక్కీలో దాచి పెట్టాడు. అయితే, వివరాల్లోకి వెళితే, నవరాత్రి ఉత్సవాల్లో అనావాయితీగా వస్తున్న కన్యా భోజ్‌లో పాల్గొనడానికి ఆ చిన్నారి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. కానీ, చిన్నారి అమ్మమ్మ, మరో బంధువుతో కలిసి గుడికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై సోమేష్ యాదవ్ అనే నిందితుడు లైంగిక దాడి చేసి హత్య చేశాడు.

Read Also: Dilsukhnagar Bomb Blast: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

ఇక, చిన్నారి ఇంట్లో కనిపించకపోవడంతో చుట్టుపక్కల మొత్తం గాలించిన ఆ బాలిక అమ్మమ్మ.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేయగా.. అసలు నిందితుడు ఆ చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అలాగే, బాలిక మృతదేహాన్ని ఇంటి పక్కన ఉండే వారి కారులో దాచి పెట్టినట్లు తెలిపారు. కాగా, ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ చిన్నారి శరీరంపై గాయాల గుర్తులతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వైద్యులు నిర్ధారించారు.

Read Also: Hardik Pandya: బయట వ్యక్తులకు ఏమీ తెలియదు.. తిలక్‌ ‘రిటైర్డ్‌ ఔట్’పై హార్దిక్ ఫైర్!

అయితే, నిందితుడు నేరం అంగీకరించాడని దుర్గ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సుఖ్‌నందన్ రాథోడ్ అన్నారు. అతడిపై అత్యాచారం, హత్య, కిడ్నాప్, ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దీనిపై నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తు పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇక, ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి స్పందించారు. ఈ సంఘటన “అమానవీయమైనది” అన్నారు. దీని వెనుక ఉన్నవారికి కఠినమైన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి సమాజంలో స్థానం లేదని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. మరణించిన చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలి, బాలిక కుటుంబానికి ధైర్యాన్ని అందించాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని సీఎం విష్ణు దేవ్ సాయి కోరారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్రకు అందరూ సహకారం అందించాలి.. స్వచ్చ ఆంధ్ర స్వర్ణాంధ్ర కోసం...

Building Collapses: ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి

Building Collapses: దేశ రాజధాని ఢిల్లీలోని ముస్తఫాబాద్‌ ప్రాంతంలో ఆరు అంతస్తుల...

Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శుభాంశు శుక్లా.. ముహూర్తం ఖరారు?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో అడుగుపెట్టిన మొట్ట మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా...

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

కాకాణిని పట్టిస్తే బహుమతి..! సోమిరెడ్డి ఆఫర్‌.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.....