22
March, 2026

A News 365Times Venture

22
Sunday
March, 2026

A News 365Times Venture

Trump: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. అణు ఒప్పందం చేసుకోకపోతే బాంబు దాడి జరుగుతుందని హెచ్చరిక

Date:

అణు ఒప్పందంపై ఇరాన్-అమెరికా మధ్య వార్ ముదురుతోంది. అణు ఒప్పందం చేసుకోవాలంటూ అమెరికా ఒత్తిడి తెస్తుంటే.. ప్రసక్తేలేదంటూ ఇరాన్ తోసిపుచ్చుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. అమెరికాతో అణు ఒప్పందం చేసుకోకపోతే బాంబు దాడి జరుగుతుందని ట్రంప్ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ద్వితీయ సుంకాలు విధిస్తామని తెలిపారు. ఈ మేరకు ఇంతకముందు జరగని దాడులు జరుగుతాయని ట్రంప్ ఆదివారం హెచ్చరిక జారీ చేశారు.

ఇది కూడా చదవండి: Home Minister Anita: క్యాన్సర్ పెషేంట్ తో విడియో కాల్ మాట్లాడిన హోం మంత్రి అనిత

కొత్త అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇప్పటికే ఇరాన్‌కు ట్రంప్ ఒక లేఖ రాశారు. అయితే ఈ ప్రతిపాదనను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తోసిపుచ్చారు. అలాగే అమెరికాతో ప్రత్యక్ష చర్చలను అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కూడా తిరస్కరించారు. పరోక్ష చర్చల అవకాశాన్ని మాత్రం తోసిపుచ్చలేదు.

ట్రంప్‌ తొలి పాలన హయాంలో టెహ్రాన్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. అప్పటినుంచి అనేక ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఇక ఇరాన్‌ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా నిలువరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకోడానికి ట్రంప్‌ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: అందుకే చంద్రబాబుకి మద్దతు ఇచ్చాను.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

దాదాపుగా 2018 నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇది కాస్త ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తర్వాత మరింత ముదిరింది. ఇరాన్ మద్దతు గల గ్రూపులపై దాడులు జరిగాయి. ప్రస్తుతం యెమెన్‌లో కూడా హౌతీ తిరుగుబాటుదారులపై కూడా వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఈ పరిణామాలు ఇరాన్‌కు రుచించడం లేదు. ఇక ట్రంప్ తాజా హెచ్చరికలతో మరోసారి ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: DC vs SRH: సన్‌రైజర్స్ ఘోర పరాజయం.. ఢిల్లీ విక్టరీ

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Benjamin Netanyahu: మేం ప్రపంచం కోసం పోరాడుతున్నాం, మాతో కలిసి రండి..

Benjamin Netanyahu: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం రోజురోజు తీవ్రంగా మారుతోంది....

Israel: ఇజ్రాయెల్ అణ్వాయుధ రహస్యం.. ప్రపంచాన్ని భయపెడుతున్న ఆ ‘చివరి నిర్ణయం’ ఏమిటి..?

దశాబ్దాలుగా ప్రపంచం ఇజ్రాయెల్ అణ్వాయుధాల గురించి ఒక వింతైన మౌనాన్ని పాటిస్తోంది....

10 Million Rial Note: ఇరాన్ 10 మిలియన్ నోట్ విడుదల.. భారత కరెన్సీలో ఆ విలువ ఎంతో తెలుసా..?

ఇరాన్ దేశం తన చరిత్రలోనే అత్యంత గరిష్ట విలువ కలిగిన ’10...

Land Mutation: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆ భూముల మ్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అడ్డంకులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక...