Viral Video: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా క్వాడ్ దేశాధినేతల సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని సనాయే తకైచి పాల్గొన్నారు. క్వాడ్ గ్రూప్ దేశాధినేతల ఫోటో సమయంలో ప్రధాని మోడీ చేసిన ఓ చిన్న పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేలపై పడివున్న భారత జెండా గుర్తు ఉన్న చిన్న కార్డును స్వయంగా తీసి తన జేబులో పెట్టుకున్నారు.
వేదికపై పడి ఉన్న జాతీయ జెండా గుర్తును మోడీ తీసుకుని తన జేబులో పెట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది. గ్రూప్ ఫోటో సమయంలో వేదికపై నేతలు నిలబడే స్థానాలను సూచించేందుకు జాతీయ జెండా మార్కర్లను ఏర్పాటు చేశారు. జాతీయ జెండా కార్డును నేలపై వదిలేయకుండా మోడీ స్వయంగా తీసుకోవడం వీడియోలో కనిపిస్తుంది.
ఈ సమావేశంలో ట్రంప్ ప్రధాని మోడీని ‘‘టఫ్ మ్యాన్’’ అంటూ ప్రశంసలు కురిపించారు. మోడీ సమర్థవంతమైన నాయకుడని, తనకు మంచి స్నేహితుడని కొనియాడారు. మరోవైపు, మోడీ మాట్లాడుతూ.. క్వాడ్ కూటమిని విశ్వసనీయ, నిర్ణయాత్మక భాగస్వామ్యంగా అభివర్ణించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రత, సరఫరా వ్యవస్థలు, నూతన సాంకేతికత, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో క్వాడ్ కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. చివరిసారిగా క్వాడ్ సమావేశం 2024 సెప్టెంబర్‌లో అమెరికాలోని డెలావేర్‌లో జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనీలాలో జరిగింది.
జాతీయ జెండా పట్ల ప్రధాని మోదీ గౌరవం..! PM Modi picks up the Indian Flag, put as position holder by logistics team ahead of the gathering of Quad leaders in Manila
#PMModi #QuadSummit #Manila #NTVTelugu https://t.co/ohqP2YKgj2
— NTV Telugu (@NtvTeluguLive) November 17, 2026




