17
November, 2026

A News 365Times Venture

17
Tuesday
November, 2026

A News 365Times Venture

Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!

Date:

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు బహిరంగ లేఖ రాశారు. అడియాల జైలులో తనకు, తన భార్య బుష్రా బీబీకి తక్షణ వైద్య సహాయం అందించాలని కోరారు. జైలులో సుదీర్ఘకాలం ఏకంగా నిర్బంధంలో ఉన్నందున తన ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుత పరిస్థితుల్లో తాను ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చని లేఖలో పేర్కొన్నారు. నవంబర్ 11న ఆదియాలా జైలులో ఇమ్రాన్‌ను కలిసిన ఆయన లాయర్ సల్మాన్ సఫ్దర్ ఈ లేఖ అందించి, న్యాయమూర్తులకు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

నవంబర్ 16న పాకిస్థాన్ ఫెడరల్ కాన్‌స్టిట్యూషనల్ కోర్టు (FCC), సుప్రీంకోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. తన కంటి చూపు మందగించడం, తనకు వైద్య చికిత్స అందించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడం ఈ లేఖ రాయడానికి కారణమని ఇమ్రాన్ పేర్కొన్నారు.

బీపీ పెరిగింది.. ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చేమో..

ఏకాంత నిర్బంధం వల్ల తన రక్తపోటు(బీపీ) తీవ్రంగా పెరిగిందని ఇమ్రాన్ ఖాన్ తన లేఖలో ఆరోపించారు. మొదట 130గా ఉన్న బీపీ ప్రస్తుతం 192కు చేరిందని, నవంబర్ 10న 193కు చేరిందని చెప్పారు. మెదడులో రక్తస్రావం, గుండెపోటు వచ్చే అవకావం ఉందని హెచ్చరించారు. తన గుండె కూడా ఇప్పటికే దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పినట్లు లేఖలో పేర్కొన్నారు. 74 ఏళ్ల వయసులో ఈ పరిస్థితులు తనను ప్రాణాలతో తిరిగి రాలేని స్థితికి చేర్చాయని ఇమ్రాన్ తన నిస్సహాయ స్థితిని లేఖలో వెల్లడించారు.

రోజుకు 22 గంటలు నిర్బంధంలోనే..

తనను రోజుకు 22 గంటల పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారని ఇమ్రాన్ ఆరోపించారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, విదేశాల్లో ఉంటున్న తన కుమారులను కలిసేందుకు అనుమతించడం లేదని తెలిపారు. పుస్తకాలు చదవడానికి, టీవీ చూసేందుకు కూడా అవకాశం లేదని పేర్కొన్నారు. తన కంటి చూపు తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. తన కుడి కంటి చూపు 85 శాతం వరకు తగ్గిపోయిందని చెప్పారు. ఆగస్టు 18న తనను రెండు రోజుల్లోగా షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించి, నిపుణులైన వైద్యులతో పరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ అది అమలు కాలేదని ఇమ్రాన్ ఆరోపించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..

భారత క్రికెట్ దిగ్గజం, 1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్...

India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!

India Summit Row: హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ‘‘భారత్ సమ్మిట్’’...

Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..

న్యూజిలాండ్‌తో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్...

Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..

హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్టేషన్ పరిధిలో నిలిపి...