17
November, 2026

A News 365Times Venture

17
Tuesday
November, 2026

A News 365Times Venture

Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..

Date:

భారత క్రికెట్ దిగ్గజం, 1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీల టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం పెద్ద తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. జూన్ 2025లో టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లీ, ఇటీవల నవంబర్ 6న టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ ఇద్దరూ తమ అనుభవంతో మరికొన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడేవారని కపిల్ పేర్కొన్నారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కపిల్ దేవ్, ఆటగాళ్లు కోపంతో లేదా తొందరపడి రిటైర్మెంట్ ప్రకటించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కేవలం దేశవాళీ లేదా ఇతర లీగ్‌ల కోసం టెస్టులను వదులుకోవడం సరికాదన్నారు. భువనేశ్వర్ కుమార్ లాంటి ఆటగాళ్లే నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుండగా, అత్యుత్తమ ఫిట్‌నెస్ కలిగిన కోహ్లీ ఇంకా చాలా కాలం ఆడగలగాల్సిందని అభిప్రాయపడ్డారు. 25 ఏళ్ల యువ క్రికెట్రికే సైతం ఫిట్‌నెస్‌లో సవాలు విసిరే స్థాయి ఉన్న కోహ్లీ, టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయంపై కచ్చితంగా పదేళ్ల తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుందని హెచ్చరించారు.

షమీ విషయానికి వస్తే.. ఎంత కష్టమైనా సరే మరో రెండు సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం ఉంటే వదులుకోకూడదని కపిల్ సూచించారు. సెలెక్టర్లు ఎంపిక చేయకపోయినా, మైదానంలో ఆడుతూ ఉంటే మళ్లీ అవకాశం వచ్చే తలుపులు తెరిచే ఉంటాయని తెలిపారు. కెరీర్‌లో ఎన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా పట్టు వదలకండా పోరాడిన మోహిందర్ అమర్‌నాథ్ స్పూర్తిని ఆటగాళ్లు అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుత తరంలో కొద్దిగా ఓపిక నశించి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని, దేశం కోసం ఆడే అత్యున్నత ఫార్మాట్‌ను ఎవరూ త్వరగా వదులుకోకూడదని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు...

India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!

India Summit Row: హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ‘‘భారత్ సమ్మిట్’’...

Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..

న్యూజిలాండ్‌తో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్...

Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..

హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్టేషన్ పరిధిలో నిలిపి...