18
November, 2026

A News 365Times Venture

18
Wednesday
November, 2026

A News 365Times Venture

Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!

Date:

Congress Chalo Delhi: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించాల్సిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసింది. ఈ కార్యక్రమాన్ని మరో తేదీన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. దీనికి బదులుగా నవంబర్ 26న దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ‘సంవిధాన్ రక్షా మార్చ్’ నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో INDIA కూటమి నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్ వేదికగా భారీ ర్యాలీ నిర్వహించింది. దీని తర్వాత తలపెట్టిన ఛలో ఢిల్లీ ప్రోగ్రాంను పార్టీ వాయిదా వేసింది.

SIR, జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరు..

ఎన్నికల సంఘం ఓట్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు ఆందోళన చేస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ 31న ఢిల్లీలో జ్ఞానేశ్ కుమార్‌‌పై ప్రతిపక్షాలు ప్రజా అభిశంసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. నవంబర్ 01న ఇండియా కూటమి ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ, ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!

UP Elections 2027: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ...

Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..

హైదరాబాద్ నగరంలో డేటింగ్ యాప్ వేదికగా పరిచయాలు పెంచుకుని, మత్తుమందు ఇచ్చి...

AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల...

INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!

INDIA Bloc: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై...