18
November, 2026

A News 365Times Venture

18
Wednesday
November, 2026

A News 365Times Venture

Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు

Date:

తెలంగాణలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, నిధుల విషయంలో కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆదివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆయా ప్రాజెక్టుల పురోగతి, వాటికి అవసరమైన అనుమతులు, నిధుల వివరాలను ప్రధానికి అందజేసినట్లు తెలిపారు.

పర్యావరణ అనుమతుల్లో జాప్యం తొలగించాలని విజ్ఞప్తి

పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మసాగర్‌, డిండి ప్రాజెక్టులపై గత, ప్రస్తుత ప్రభుత్వాలు కలిపి సుమారు రూ.50 వేల కోట్లు వెచ్చించాయని, సుప్రీంకోర్టు స్టే సహా పలు కారణాలతో పనులు మందగించాయని మంత్రి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దరఖాస్తులు స్వీకరించి పర్యావరణ అంచనా చేపట్టవచ్చని, కేంద్ర పర్యావరణ శాఖలో నెలల తరబడి నెలకొన్న జాప్యాన్ని తొలగించి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సహకారానికి ప్రధాని చొరవ కోరుతూ..

తుమ్మిడిహట్టి వద్ద గతంలో కుదిరిన ఒప్పందాన్ని 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాల్సిన అవసరத்தை ప్రధానికి వివరించినట్లు ఉత్తమ్‌ తెలిపారు. మహారాష్ట్ర అంగీకారం సాధించేందుకు ప్రధాని చొరవ కోరామని, అదనపు ముంపునకు కేంద్రం లేదా మహారాష్ట్ర నిర్ణయించే మేర పరిహారం చెల్లించడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అలాగే సమ్మక్క–సారలమ్మ బ్యారేజీకి సంబంధించి ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ జారీని వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపారు. నవంబర్‌ 16న కేంద్ర జల సంఘం చైర్మన్‌ను కలవనున్నట్లు, నవంబర్‌ 17న సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఎన్‌ఓసీపై చర్చిస్తామని వెల్లడించారు.

అదనపు నిధులు, భూగర్భ జలాల పరిరక్షణకు ప్రత్యేక సాయం

2027–28 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన కింద సీతమ్మసాగర్‌–సీతారామ, మోడికుంట వాగు, చిన్న కాళేశ్వరం, చనాకా–కొరాట బ్యారేజీ వంటి నాలుగు సాగునీటి పథకాలకు రూ.5,856 కోట్లు కోరినట్లు ఉత్తమ్‌ వెల్లడించారు. అలాగే 70 నుంచి 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల తుది పనుల నిమిత్తం అదనంగా రూ.5,000 కోట్లు మంజూరు చేయాలని కోరామన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణకు రూపొందించిన కార్యాచరణ కోసం రూ.5,000 కోట్ల ప్రత్యేక కేంద్ర ఆర్థిక సాయం కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వచ్చే వానాకాలం వరకు తాగునీటికి సరిపడా నీరు రిజర్వాయర్లలో నిల్వ ఉందని, ప్రస్తుత యాసంగిలో వరి సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.

మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయడం అసాధ్యం

మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం లేదని నిపుణులు స్పష్టంగా తేల్చిచెప్పారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల రూపకల్పనలో, నిర్మాణంలో లోపాలున్నాయని నిపుణులు లిఖితపూర్వకంగా పేర్కొన్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనే బ్యారేజీ దెబ్బతిన్నదని, ఇప్పుడు అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయాలని కోరడం అర్థరహితమని ఆయన స్పష్టం చేశారు. నవంబర్‌ 22 వరకు తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు రావాలని ప్రధాని మోదీని ఈ సందర్భంగా ఆహ్వానించినట్లు వెల్లడించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!

UP Elections 2027: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ...

Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..

హైదరాబాద్ నగరంలో డేటింగ్ యాప్ వేదికగా పరిచయాలు పెంచుకుని, మత్తుమందు ఇచ్చి...

AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల...

INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!

INDIA Bloc: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై...