11
November, 2026

A News 365Times Venture

11
Wednesday
November, 2026

A News 365Times Venture

Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్‌లు..

Date:

Nayanthara Box Office Failures: ‘లేడీ సూపర్ స్టార్’ అనే బిరుదు, కోట్ల రూపాయల రెమ్యునరేషన్, క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్నప్పటికీ నయనతారకు ఇటీవల కాలంలో ఎదురవుతున్న ఫలితాలు తీవ్ర నిరాశను మిగులుస్తున్నాయి. హీరోయిన్‌గా నటించినా, నిర్మాతగా బరిలోకి దిగినా బాక్సాఫీస్ వద్ద విజయం దక్కడం లేదు. ఒకప్పుడు నయన్ సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద ప్రత్యేక క్రేజ్ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ క్రేజ్ వసూళ్లుగా మారడంలో విఫలమవుతోంది. స్టార్ హీరోయిన్‌గా తనకున్న మార్కెట్‌ను నిలబెట్టుకోవడంలో ఆమె ఇబ్బంది పడుతోందా అనే సందేహాలు సినీ వర్గాల్లో మొదలయ్యాయి.

ఈ ఏడాది తెలుగులో వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ మినహా ఆమె నటించిన మరే ఇతర చిత్రం కూడా ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ముఖ్యంగా భారీ అంచనాల నడుమ సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన ‘మూకుర్తి అమ్మన్ 2’ (మహాశక్తి) బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. మొదటి భాగం ఓటీటీలో ఘనవిజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ హైప్ ఏర్పడినప్పటికీ.. థియేటర్లలో మాత్రం అది ప్రభావం చూపలేకపోయింది. అటు కవిన్‌తో కలిసి నటించిన ‘హాయ్’ చిత్రం కూడా థియేట్రికల్ సక్సెస్‌ను అందుకోలేకపోయింది. వీటికి తోడు యష్ నటించిన ‘టాక్సిక్’ చిత్రంలో కీలక పాత్ర పోషించినప్పటికీ.. ఆ సినిమా ఫలితం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో నయన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది.

వరుస డిజాస్టర్లు పలకరిస్తున్న వేళ, నయనతార చేతిలో ఉన్న భవిష్యత్ ప్రాజెక్టులపైనే అందరి దృష్టి నెలకొంది. మలయాళ స్టార్ నివిన్ పౌలీతో కలిసి నటిస్తున్న ‘డియర్ స్టూడెంట్స్’, దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నయనతార 81’, అలాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘రక్కాయి’ చిత్రాలపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ‘రక్కాయి’లో నయనతార సరికొత్త యాక్షన్ అవతారంలో కనిపించనుండటం ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. వీటితో పాటు.. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో చేయనున్న ‘ధర్మన్’ ప్రాజెక్ట్, సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రానున్న భారీ బాలీవుడ్ చిత్రం నయనతార కెరీర్‌లో అత్యంత కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం నయనతారకు ఒక భారీ హిట్ అనేది కేవలం అవసరం మాత్రమే కాదు.. తన లేడీ సూపర్ స్టార్ హోదాను బాక్సాఫీస్ వద్ద తిరిగి నిరూపించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Sonia Gandhi: సోనియా ప్రధాని కాకపోవడానికి కారణం వాళ్లే.. సంచలన విషయాలు వెలుగులోకి..

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ...

AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం రాష్ట్ర అభివృద్ధి,...

Rain Alert In Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. పొంచి ఉన్న తుఫాన్..

బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నెల 13వ తేదీ...