11
November, 2026

A News 365Times Venture

11
Wednesday
November, 2026

A News 365Times Venture

Indiramma Indlu: రూ.5 లక్షలతో 20 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం!

Date:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు తక్కువ ఖర్చుతో, వేగవంతంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అందించేందుకు ఒక వినూత్న మోడల్ ఇంటిని సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో రూ.5 లక్షల వ్యయంతో కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే నిర్మించిన ఈ మోడల్ ఇందిరమ్మ ఇంటిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఘనంగా ప్రారంభించారు.

ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుండగా, అదే బడ్జెట్‌లో నాణ్యమైన ఇంటిని వేగంగా నిర్మించి ఇవ్వడానికి కాల్జన్ సంస్థ ముందుకు వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారులు ఈ మోడల్ ఇంటిని నేరుగా పరిశీలించి, ఇటువంటి ఆధునిక నిర్మాణ విధానాలను ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ నిర్మాణం వెనుక ఉన్న సాంకేతికతను వివరించిన కాల్జన్ సంస్థ యజమాని కార్తీక్, తమ సంస్థ స్టీల్ ఇన్‌ఫ్లుయెన్స్ ఫామ్‌వర్క్ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఉత్పత్తులతో పాటు మోనోలిథిక్ కాంక్రీట్ విధానాన్ని వాడటం వల్ల నిర్మాణం ఎంతో బలంగా ఉంటుందని, 15 నుంచి 20 రోజుల స్వల్ప సమయంలోనే పూర్తి పనులు పూర్తి చేసి ఇల్లు అందిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ఈ సాంకేతికతతో నిర్మించే ఇళ్లకు 15 నుంచి 20 సంవత్సరాల వరకు గ్యారెంటీ ఇస్తున్నట్లు వివరించారు.

ఈ మోడల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు పెంటారెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఇంజనీర్లు మరియు కాల్జన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. తక్కువ సమయంలో, పరిమిత బడ్జెట్‌లో సొంతింటి కల నెరవేర్చే ఈ తరహా ఆధునిక నిర్మాణాలు పేదలకు ఎంతగానో ప్రయోజనకరంగా మారనున్నాయి.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం రాష్ట్ర అభివృద్ధి,...

Rain Alert In Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. పొంచి ఉన్న తుఫాన్..

బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నెల 13వ తేదీ...

Aaryavir Sehwag: బ్యాటింగ్‌లో వీరవిహారం చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ప్రపంచంలో సరికొత్త రికార్డు..

యూఏఈతో జరిగిన అండర్-19 ఆసియా కప్‌ మ్యాచ్‌లో భారత యువ సంచలనం,...

IPL 2028: ఐపీఎల్ అభిమానులకు పండగే పండగా.. ఐపీఎల్‌లోకి రెండు కొత్త జట్లు..

భారత క్రికెట్ నియంత్రణ మౌలిక మండలి ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను...