10
November, 2026

A News 365Times Venture

10
Tuesday
November, 2026

A News 365Times Venture

Pakistan Tarbela Dam Accident: పాక్‌లో నిర్మాణంలో ఉన్న ఆనకట్ట కూలి భారీ వరదలు.. చైనా నిర్మాణ సంస్థపై ప్రశ్నలు..!

Date:

Pakistan Tarbela Dam Accident: పాకిస్థాన్‌లో భారీ నిర్మాణ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చైనా కంపెనీ నిర్మిస్తున్న ఆనకట్టలో కొంత భాగం కూలిపోవడంతో భారీగా నీరు ప్రవహించి సమీప ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని తర్బేలా ఆనకట్ట ఐదో విస్తరణ ప్రాజెక్టు (T-5) నిర్మాణ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదాన్ని పాకిస్థాన్ జల, విద్యుత్ అభివృద్ధి సంస్థ (WAPDA) కూడా ధృవీకరించింది. తర్బేలా ఆనకట్ట ఐదో విస్తరణ ప్రాజెక్టును చైనాకు చెందిన పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా లిమిటెడ్ (PCCCL) నిర్మిస్తోంది. అనుసంధాన సొరంగం తవ్వకాలు చేపడుతున్న సమయంలో బలహీనమైన రాతి పొర కూలిపోవడంతో నీరు సొరంగంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి నిర్మాణంలో ఉన్న పవర్‌హౌస్‌లోకి భారీగా నీరు చేరింది. దీంతో అధికారులు వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించి నిర్మాణ పనులను నిలిపివేశారు.

ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అతడిని సురక్షితంగా రక్షించినట్లు సమాచారం. డాన్ వెబ్‌సైట్ కథనం ప్రకారం, నిర్మాణ ప్రాంతంలోని కార్మికులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదం కారణంగా ప్రాజెక్టు పనులకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఆనకట్ట నుంచి అదనపు నీటిని విడుదల చేసినట్లు స్వాబి డిప్యూటీ కమిషనర్ నస్రుల్లా ఖాన్ వెల్లడించారు. దీంతో సింధు నదిలో నీటి ప్రవాహం, నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు నదిలో స్నానం చేయడం, ఈత కొట్టడం, పడవ ప్రయాణాలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను డాన్ విడుదల చేసింది. ఆనకట్ట నిర్మాణ ప్రాంతం నుంచి భారీగా నీరు ప్రవహించడం, ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీయడం వంటి దృశ్యాలు అందులో కనిపించాయి. భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు, నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది.

భారీగా పెరిగిన ప్రాజెక్టు వ్యయం..
తర్బేలా ఐదో విస్తరణ ప్రాజెక్టు 1,530 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం తొలుత 82 బిలియన్ పాకిస్థానీ రూపాయలుగా ఉండగా, తర్వాత 317 బిలియన్ రూపాయలకు పెరిగింది. గతంలో జూలైలో కాఫర్ డ్యామ్ కూలిన ఘటన కూడా చోటుచేసుకుంది. అప్పట్లో కాంట్రాక్టర్, కన్సల్టెంట్లు, వాప్డా సంస్థ బాధ్యతపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ ప్రాజెక్టును 2028 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (AIIB) నుంచి దీనికి ఆర్థిక సహాయం అందుతోంది. ప్రాజెక్టు పూర్తయితే తర్బేలా ఆనకట్ట మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుత 4,888 మెగావాట్ల నుంచి 6,418 మెగావాట్లకు పెరగనుంది. పాకిస్థాన్‌లోని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే తర్బేలా ప్రాజెక్టులో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలపై ఆందోళనలను పెంచుతున్నాయి. తాజా ఘటనతో ప్రాజెక్టు పనులు, భవిష్యత్తు గడువుపై ప్రభావం పడే అవకాశం ఉంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..

Diwali Cleaning Tips: దేశం మొత్తం దీపావళి కాంతులతో వెలిగిపోతుంది.. అయితే,...

Off The Record: విజయనగరం మేయర్ విషయంలో కోలగట్ల తడబాటు.. అతి విశ్వాసంతో మొదటికే మోసం..!

Off The Record: మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామికి...

AP Cabinet Meeting: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్? రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు అనగా...

CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల కొడంగల్ పర్యటన విజయవంతంగా...