10
November, 2026

A News 365Times Venture

10
Tuesday
November, 2026

A News 365Times Venture

Off The Record: విజయనగరం మేయర్ విషయంలో కోలగట్ల తడబాటు.. అతి విశ్వాసంతో మొదటికే మోసం..!

Date:

Off The Record: మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామికి విజయనగరం ఓటర్లు గట్టి షాకే ఇచ్చారన్న అభిప్రాయం బలపడుతోంది. అయితే అది స్వయంకృతమేనని, ఆయన నేల విడిచి సాము చేశారన్న విశ్లేషణలు ఆసక్తి రేపుతున్నాయి. మొన్నటి మున్సిపల్‌ ఎన్నికల్లో తన కుమార్తె శ్రావణిని మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపారాయన. రాజకీయ సమీకరణలు అనుకూలంగా లేవన్న అభిప్రాయాలు తొలి నుంచే వ్యక్తమైనా.. మేయర్ పీఠం తమదేనన్న ధీమాతో ముందుకు సాగి దెబ్బతిన్నట్టు చెప్పుకుంటున్నారు. వార్డుల్లో వైసీపీకి స్థానాలు తగ్గినా.. మేయర్ అభ్యర్థి గెలుపు ఖాయమన్న అంచనాల్లో ఉన్నారట ఆయన. కూటమి బలాన్ని, స్థానిక రాజకీయ పరిణామాలను తక్కువగా అంచనా వేయడం, తన రాజకీయ అనుభవం గురించి ఎక్కువగా ఊహించుకోవడం లాంటి కారణాలే కోలగట్లను దెబ్బ కొట్టాయని అంటున్నారు. అప్పుడు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా… వార్డుల్లో పార్టీ అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓట్లు అడుగుతుంటే.. కోలగట్ల వర్గం మాత్రం వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… మేయర్‌గా శ్రావణిని గెలిపించాలని ప్రచారం చేసిందని, అదే పూర్తిగా రివర్స్‌ అయినట్టు చెప్పుకుంటున్నారు. రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ, స్థానిక ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తుంటారు స్థానిక అభ్యర్థులు.

కానీ మేయర్ అభ్యర్థి గెలుపు కోసం లోకల్‌ క్యాండిడేట్‌ను పక్కన పెట్టారన్న భావన కలిగితే…. కచ్చితంగా దానివల్ల ఇద్దరికీ నష్టం జరుగుతుంది. కోలగట్ల శ్రావణి విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నారు. నా కూతురిని చూడండంటూ ఎన్నికల ప్రచారంలో వీరభద్రస్వామి ఇచ్చిన సందేశం…. స్థానిక అభ్యర్థికి ఓటేయమన్న అభ్యర్థనను వెనక్కి నెట్టిందన్న చర్చ ఇప్పుడు విజయనగరం వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. మేయర్ అభ్యర్థి కోసం పార్టీ మొత్తం పనిచేయాల్సిందే. కానీ…. అదే సమయంలో డివిజన్స్‌లో పోటీ చేసే అభ్యర్థులకు కూడా సమానమైన రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే, ఈ లాజిక్‌ మిస్‌ అయ్యే.. కోలగట్ల పన్నిన వ్యూహం బెడిసి కొట్టిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు‌. మేయర్ అభ్యర్థి గెలుపును ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న క్రమంలో.. వార్డుల్లో స్థానిక నాయకుల అసంతృప్తి, క్యాడర్‌లో ఉన్న విభేదాలు స్వామిని చుట్టుముట్టాయట. ఆ క్రమంలో…ఎవరికి వారు పార్టీ అన్న సంగతి మర్చిపోయి నేను గెలిస్తే చాలన్నట్టు పనిచేయడం వోవరాల్‌గా మేయర్‌ అభ్యర్థి మీద ప్రభావం చూపిందని అంటున్నారు. అటు కూటమి రాజకీయ వ్యూహాలు, మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ లాంటి విషయాల్లో కూడా వైసీపీ అంచనాలు తప్పాయట. మరోవైపు కోలగట్ల చుట్టూ ఉన్న కొందరు నాయకులే ఆయనకు వాస్తవ పరిస్థితులను వివరించకుండా.. అనుకూల నివేదికలు ఇచ్చారన్న విమర్శలు కూడా సొంత పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అంతా బాగుందని చెప్పడం.. స్థానిక నాయకుల అసంతృప్తిని పట్టించుకోకపోవడం.. వాటన్నిటికీ మించి వోవర్‌ కాన్ఫిడెన్స్‌ లాంటివన్నీ కలగలిసి పార్టీ గెలుపు మీద దెబ్బేశాయని విశ్లేషిస్తున్నారు విజయనగరం వైసీపీ నాయకులు.

డివిజన్స్‌లో పోటీ చేసే నాయకులు తమ గెలుపు కోసం కష్టపడుతున్న సమయంలో.. మేయర్ అభ్యర్థి గెలుపుపై మాత్రమే వీరభద్రస్వామి ఎక్కువగా దృష్టి పెట్టడం వారిలో అసంతృప్తి రేపిందట. మేయర్ అభ్యర్థి కోసం ప్రత్యేకంగా ప్రచారం చేయడం వల్ల ఏర్పడిన రాజకీయ వైరుధ్యం పార్టీకి నష్టం కలిగించిందని అంటున్నారు. కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా పనిచేయాల్సిన సమయంలో.. వ్యక్తిగత రాజకీయ ప్రాధాన్యాలు ముందుకు రావడం పార్టీ క్యాడర్‌లో సమన్వయాన్ని దెబ్బతీసిందన్నది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో టాక్. మేయర్ అభ్యర్థి గెలుపు కోసం డివిజన్‌ నాయకులను ఉపయోగించుకోవడం ఒక వ్యూహం. కానీ… వాళ్ళని వదిలేసి డైరెక్ట్‌గా మేయర్‌ మీదే ఫోకస్‌ చేయడమంటే నేల విడిచి సాము చేయడమేనన్న అభిప్రాయం బలంగా ఉంది. అంత అనుభవం ఉండి కూడా…. మాజీ డిప్యూటీ స్పీకర్‌ చేసిన ఆ తప్పువల్ల ఆయన భారీ మూల్యమే చెల్లించుకున్నారన్నది లోకల్‌ పొలిటికల్‌ అనాలసిస్‌. మేయర్ గెలుపుపై అతిగా నమ్మకం, డివిజన్స్‌లో కార్పొరేటర్‌ అభ్యర్థుల ప్రాధాన్యాన్ని విస్మరించడం, స్థానిక నాయకుల అసంతృప్తి.. కూటమి రాజకీయ వ్యూహాలను తక్కువగా అంచనా వేయడంలాంటివన్నీ కలగలిసి డాటర్‌ ఆఫ్‌ వీరభద్రస్వామికి డ్యామేజ్‌ చేశాయంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..

Diwali Cleaning Tips: దేశం మొత్తం దీపావళి కాంతులతో వెలిగిపోతుంది.. అయితే,...

Pakistan Tarbela Dam Accident: పాక్‌లో నిర్మాణంలో ఉన్న ఆనకట్ట కూలి భారీ వరదలు.. చైనా నిర్మాణ సంస్థపై ప్రశ్నలు..!

Pakistan Tarbela Dam Accident: పాకిస్థాన్‌లో భారీ నిర్మాణ ప్రాజెక్టులో ఘోర...

AP Cabinet Meeting: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్? రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు అనగా...

CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల కొడంగల్ పర్యటన విజయవంతంగా...