10
November, 2026

A News 365Times Venture

10
Tuesday
November, 2026

A News 365Times Venture

Off The Record: సూర్యాపేట కాంగ్రెస్ ను ముంచుతున్న గ్రూప్ వార్..!

Date:

Off The Record: సూర్యాపేట కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. కొంతకాలంగా ఇక్కడి పార్టీ నేతలు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటుండగా…. ఇప్పుడది బయటపడిపోయిందని అంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం తాజాగా సూర్యాపేటలో జరిగింది. ఆ సందర్భంగానే… హస్తం పార్టీ నేతల మధ్య రేగిన వివాదం లోకల్‌గా పార్టీ పరిస్థితిని చెప్పకనే చెబుతోందంటున్నారు పరిశీలకులు. సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి ఫోటో లేకపోవడంతో రచ్చ మొదలైంది. అయితే… దానికి బీజం ఇప్పుడు పడింది కాదని, సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ ఎప్పుడో రెండు వర్గాలుగా విడిపోవడమే మెయిన్‌ రీజన్‌ అని అంటున్నారు పార్టీ నాయకులు. చాలా కాలంగా… వివిధ సందర్భాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో దివంగత నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఫోటో మాత్రమే ఉంటోంది. అదే సమయంలో దామోదర్‌రెడ్డి కుమారుడు, పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో తన తండ్రి ఫోటో ఉంటోందిగానీ… మార్కెట్ కమీటి చైర్మన్ ఫోటోలు కనిపించడం లేదు. దీంతో… ఫ్లెక్సీల్లో కాదు, రెగ్యులర్‌గా కూడా నేతలు విడిపోయారని, దామోదర్‌రెడ్డి కొడుకు ఒక వర్గం, నాటి ప్రధాన అనుచరుడు మరో వర్గంగా రాజకీయం చేస్తున్న ఎఫెక్ట్‌ పార్టీ మీద పడుతోందని కేడర్ మాట్లాడుకుంటోంది. పార్టీ పిలునిచ్చిన కార్యక్రమాలు కూడా ఇక్కడ వేర్వేరుగానే జరుగుతున్నాయి. ముఖ్యనేతల టూర్స్‌లోనూ సేమ్‌ సీన్‌.

ఇంకా చెప్పాలంటే… ఇద్దరూ హస్తం పార్టీ కోసమే పని చేస్తున్నా… ఈ ఇంటిమీద కాకి ఆ ఇంటిమీద…. ఆ ఇంటిమీద కాకి ఈ ఇంటిమీద వాలని పరిస్థితి చాలా కాలంగా ఉందని అంటున్నారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి అనారోగ్యంతో చనిపోవడానికి ముందు వరకు సర్వోత్తమ్ రెడ్డి, వేణారెడ్డి పాలు నీళ్లలా కలిసి ఉండేవారు. పెద్దాయన చనిపోయాక కూడా… కొన్నాళ్ళు కలిసే పనిచేశారు. కానీ… కొన్నాళ్ళు గడిచాక ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రోజులు గస్తున్నకొద్దీ..వ్యవహారం ఉప్పు, నిప్పులా తయారైందని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. మొదట్లో పరస్పరం ఎదురుపడితే… నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించుకున్నట్టు వ్యవహరించేవారని, మెల్లిగా ఆ దశ దాటి వేరువేరుగా కార్యక్రమాలు చేసే వరకు వెళ్లిందని గుర్తు చేస్తున్నారు. సూర్యాపేట నుండి రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన తన తండ్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఓటమికి… ఆయన వెంట కీలకంగా ఉన్నవేణారెడ్డి, ఇతర నేతల వైఖరే ప్రధాన కారణమని నమ్ముతున్నారట సర్వోత్తమ్ రెడ్డి.
ఆయన ఆ అభిప్రాయానికి రావడమే ఈ గ్యాప్‌నకు ప్రధాన కారణం అని చెప్పుకుంటున్నారు. తన తండ్రిని అడ్డం పెట్టుకొని సదరు నేతలు చేసిన అవినీతి, అక్రమాల వల్లే… ఆయన రెండు సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కోల్పోయారంటూ సన్నిహితులతో సర్వోత్తమ్ రెడ్డి అంటున్నట్టు తెలుస్తోంది.

అందుకే…. తాను కూడా అవినీతి ఆరోపణలున్న నేతలను పక్కన పెట్టాల్సిందేనని డిసైడ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. దీంతో… తన తండ్రితో సన్నిహితంగా మెలిగి, అన్ని రకాలుగా ఎదిగిన ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ వేణా రెడ్డి, ఇంకొందరు నేతలకు సర్వోత్తమ్ రెడ్డి దూరంగా జరిగారన్నది ఆయన సన్నిహిత వర్గాల మాట. ఈ క్రమంలో సూర్యాపేట నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగా, క్రీయాశీలకంగా ఉన్న నేతల మధ్య దూరం చాలానే పెరిగిందంటున్నారు. అదే సమయంలో తాము పదేళ్లు కాంగ్రెస్‌ను బతికించామని, నిరాధార ఆరోపణలతో వేరు చేయడం సరికాదని తన సన్నిహితులకు చెప్తున్నారట మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి. ఈ వ్యవహారాలతో ప్రస్తుతం సూర్యాపేట కాంగ్రెస్‌ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇది చూస్తున్నవాళ్ళంతా…అధికారంలో ఉండి కూడా ఈగోలేంటి? అయినా… రాత రాళ్ళేలమని ఉంటే… రాజ్యాలెలా ఏలుతారంటూ అని సెటైరికల్‌గా మాట్లాడుకుంటున్నారు కొందరు. అటు కాంగ్రెస్‌ కేడర్‌ కూడా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నా… వీళ్ళ తీరు మారదా…? మూతి కాలుతున్నా కుంపటే ముద్దు అంటే ఎలాగంటూ అసహనంగా ఉందంటున్నారు.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..

Diwali Cleaning Tips: దేశం మొత్తం దీపావళి కాంతులతో వెలిగిపోతుంది.. అయితే,...

Pakistan Tarbela Dam Accident: పాక్‌లో నిర్మాణంలో ఉన్న ఆనకట్ట కూలి భారీ వరదలు.. చైనా నిర్మాణ సంస్థపై ప్రశ్నలు..!

Pakistan Tarbela Dam Accident: పాకిస్థాన్‌లో భారీ నిర్మాణ ప్రాజెక్టులో ఘోర...

Off The Record: విజయనగరం మేయర్ విషయంలో కోలగట్ల తడబాటు.. అతి విశ్వాసంతో మొదటికే మోసం..!

Off The Record: మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామికి...

AP Cabinet Meeting: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్? రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు అనగా...