8
November, 2026

A News 365Times Venture

8
Sunday
November, 2026

A News 365Times Venture

Garapati Divya: నిన్న గుండెపోటుతో హఠాన్మరణం.. నేడు ఫలితాల్లో ఘన విజయం.. జనసేన అభ్యర్థి కన్నీటి గాథ

Date:

Garapati Divya: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో శోకసంద్రం అలుముకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా గారపాటి దివ్య(28) పోటీ చేశారు. నేడు (శనివారం) వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆమె 350 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కానీ.. దివ్య నిన్న (శుక్రవారం) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. జనాధారణతో గెలిచినా.. మృత్యువుతో పోరాడి ఓడారు. ఈ ఘటనతో విజయం సాధించిన ఆనందాన్ని అనుభవించక ముందే ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. ఇక, డిగ్రీ పూర్తి చేసి, శ్రీనివాస్‌ను ప్రేమ వివాహం చేసుకున్న దివ్యకు ఐదేళ్లు, మూడు నెలల వయసున్న ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. గురువారం జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఓటేసిన కొద్దిసేపటికే ఆమెకు కడుపునొప్పి రావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం కుదుటపడిందని ఇంటికి తీసుకొచ్చినప్పటికీ, శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించి రాజమహేంద్రవరం తరలిస్తుండగా ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

నిన్న శుక్రవారం ఆమె మృత్యువుతో పోరాడి కన్నుమూస్తే, సరిగ్గా నేడు శనివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆమె ఏకంగా 350 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ప్రజల నుంచి అపారమైన మద్దతును గెలుచుకుని, తన వార్డు అభివృద్ధిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువ నాయకురాలు నేడు గెలిచిన వార్తను చూసేందుకు భౌతికంగా లేకపోవడం ఆ గ్రామస్థులను కంటతడి పెట్టిస్తోంది. కన్నతల్లిని కోల్పోయి పసిమొగ్గలు రోదిస్తుంటే, గెలుపు సంతోషం ఉండాల్సిన ఆ ఇంట విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఇక నిన్న దివ్య భౌతికకాయానికి గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు, జనసేన ఇన్‌ఛార్జి సువర్ణరాజు, కూటమి నాయకులు నివాళులర్పించి, కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష అందజేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Surekha Vani : “వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే జైలుకే!”: నటి సురేఖావాణి వీడియో వార్నింగ్

సోషల్ మీడియాలో తన వ్యక్తిగత వీడియో ఒకటి లీక్ కావడంతో జరుగుతున్న...

India vs New Zealand: వర్షం ఆటంకంతో అర్ధంతరంగా ముగిసిన మ్యాచ్.. టీమిండియా థ్రిల్లింగ్ విజయం

India vs New Zealand: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా...

Daryl Mitchell: ఈ పిచ్ మరీ దారుణంగా ఉంది.. ఓటమిపై మిచెల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Daryl Mitchell: భారత్‌తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ (New Zealand)...