8
November, 2026

A News 365Times Venture

8
Sunday
November, 2026

A News 365Times Venture

Daryl Mitchell: ఈ పిచ్ మరీ దారుణంగా ఉంది.. ఓటమిపై మిచెల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Date:

Daryl Mitchell: భారత్‌తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ (New Zealand) బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. ప్రత్యర్థి బౌలింగ్‌ను ఎదుర్కోవడమే కాకుండా, ఊహకందని పిచ్‌ తీరుతో కివీస్ బ్యాటర్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వెల్లింగ్టన్ (Wellington) పిచ్‌ అచ్చం “ట్రామ్‌పోలిన్‌పై బ్యాటింగ్ చేస్తున్నట్లుగా” ఉందని కివీస్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ (Daryl Mitchell) మ్యాచ్ తర్వాత ఓపెన్‌గా చెప్పేశాడు. బంతి ఎప్పుడు ఎంత ఎత్తు లేస్తోందో అస్సలు అంచనా వేయలేకపోయినట్లు వెల్లడించాడు. దీంతో ఆతిథ్య జట్టు కేవలం 134 పరుగులకే ఆలైట్ (All out) అయిపోయింది.

ఈ మ్యాచ్‌లో డారిల్ మిచెల్ ఒక్కడే ఒంట పోరాటం చేశాడు. 104 బంతుల్లో 55 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పిచ్ కండిషన్స్ చాలా సవాల్‌గా ఉన్నాయని, అనుకోని బౌన్స్, పరుగులు రాబట్టడం కష్టమవ్వడంతో ఇన్నింగ్స్‌లో కుదురుకోవడం కష్టమైందని మిచెల్ అన్నాడు. “పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. స్కోర్ బోర్డుపై ఇంకా కొన్ని పరుగులు ఉంటే బాగుండేది. కానీ పిచ్ ట్రిగ్గర్ అయిన తీరు చూస్తే ట్రామ్‌పోలిన్‌లా అనిపించింది. బంతి ఎత్తు ఎలా వస్తుందో తెలియక నానా ఇబ్బంది పడ్డాం. ఎలాగోలా కష్టపడి స్కోర్ దాటించాం, బౌలింగ్‌లో ఏదో అద్భుతం జరుగుతుందని ఆశిస్తున్నాం” అని బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇక ఈ డ్రాప్-ఇన్ పిచ్‌ (Drop-in pitch) ప్రత్యేకతల వల్ల సింగిల్స్ తీయడం కూడా కత్తి మీద సాములా మారిందని మిచెల్ చెప్పుకొచ్చాడు. పిచ్ పక్కన ఎలాంటి ప్రాక్టీస్ పిచ్‌లు లేకపోవడం, షాట్ ఆడిన వెంటనే బంతి ఆగిపోవడం వల్ల స్ట్రైక్ రొటేట్ చేయడం (Rotate strike) చాలా కష్టమైందని తెలిపాడు. ఈ కఠినమైన బౌన్స్, స్లో నేచర్ కారణంగా కొన్నిసార్లు బ్యాట్‌తో గట్టిగా బదిలి బాదేయడం మినహా వేరే మార్గం కనిపించలేదన్నాడు. ఇన్నింగ్స్‌లో భాగంగా మిచెల్ తన బలాన్నే నమ్ముకుంటూ ఇండియన్ బౌలర్ల (Indian bowlers) వ్యూహాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే టీమిండియా బౌలర్లు ప్రతిసారి పాట్నషిప్‌లను దెబ్బతీయడంతో కివీస్‌ కుదేలైంది. ముఖ్యంగా 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును మిచెల్, మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు విలువైన 59 పరుగులు జోడించారు. మిచెల్ పోరాటం వల్ల కివీస్ కనీసం 130 పరుగుల మార్కైనా దాటగలిగింది. స్కోర్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ, బౌలింగ్‌తో మ్యాచ్‌ను మళ్లీ తమ వైపు తిప్పుకోవచ్చనే ఆశతోనే ఉన్నట్లు మిచెల్ స్పష్టం చేశాడు. మ్యాచ్‌లో రన్ రేట్ ప్రెజర్ (Run-rate pressure) లేకపోయినా, పవర్‌ప్లేలో (Powerplay) కొన్ని త్వరగా వికెట్లు తీసి భారత మిడిల్ ఆర్డర్‌పై (Middle order) ఒత్తిడి తెస్తే ఫలితం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేమని ధీమా వ్యక్తం చేశాడు. కానీ చివరికి నిరేశే మిగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అనూహ్య విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో (DLS Method) భారత్‌కు 4 పరుగుల తేడాతో విజయం వరించింది. ఉత్కంఠభరితంగా ముగియాల్సిన ఈ మ్యాచ్ ఇలా అర్ధంతరంగా ముగియడం ఫ్యాన్స్‌కి కాస్త నిరాశ కలిగించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Tesla Cybertruck: “మూడేళ్లకే కథ ముగిసింది”.. టెస్లా ‘సైబర్ ట్రక్’ ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు మస్క్ ప్రకటన..

Tesla Cybertruck: నాలుగు సంవత్సరాలు కూడా తిరక్కముందే కథ ముగిసింది.. ప్రముఖ...

Cheyutha Pensions: గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు..

Cheyutha Pensions: తెలంగాణలోని నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పండుగ వేళ...

Konaseema: తండ్రి వైసీపీ.. కూతురు టీడీపీ.. ఎన్నికల్లో ఇద్దరూ గెలుపు..

Konaseema: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వేర్వేరు రాజకీయ వేదికలపై...