29
October, 2026

A News 365Times Venture

29
Thursday
October, 2026

A News 365Times Venture

OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?

Date:

OTR: ఆ సీనియర్ ఐఏఎస్ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారా? తెలంగాణలో అత్యంత కీలకమైన పోస్ట్‌ ఆశించి భంగపడ్డారా? కోరుకున్న పోస్ట్‌ రాదని కన్ఫాన్‌ చేసుకున్నాకే… ముందస్తు పదవీ విరమణ నిర్ణయమా? లేక అంతకు మించిన వేరే కారణాలున్నాయా? ఇంతకీ ఎవరా ఐఎఎస్‌? ఆ వీఆర్‌ఎస్‌ కథా కమామీషు ఏంటి?. తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న సీనియర్ ఐఎఎస్ స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్ధమయ్యారు. ఇంకా పది నెలల పదవీ కాలం మిగిలి ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.1992 బ్యాచ్‌కు చెందిన జయేష్ రంజన్ వీఆర్ఎస్ దరఖాస్తుపై కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న జయేష్‌ అకస్మాత్తుగా వీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం బ్యూరోక్రసీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు పాలనాపరమైన నిర్ణయాల్లో, ప్రాధాన్యతల్లో తన సీనియార్టీకి తగిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదనే అసహనం ఆయనలో ఉన్నట్టు బయట, ప్రభుత్వ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు పై జయేష్ రంజన్ ఆశలు పెట్టుకున్నారట. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును ఇక్కడికి తీసుకువచ్చి… సీఎస్‌గా నియమించింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే… క్షేత్రస్థాయి నుంచి స్టేట్‌ లెవల్‌ వరకు వివిధ ముఖ్య శాఖల్లో పని చేశారు జయేష్‌. కడప, గుంటూరు, మెదక్ జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారాయన. హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా సుమారు మూడేళ్లు పట్టణాభివృద్ధి విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా, పర్యాటక-సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హయాంలో ఏపీ పర్యాటక రంగం జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచిందని చెప్పుకుంటారు.

అంతేకాకుండా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా, గిరిజన సంక్షేమం, సహజ వనరుల నిర్వహణ, పేదరిక నిర్మూలన వంటి సామాజిక రంగాల్లో దాదాపు 12 ఏళ్లకు పైగా పని చేయడంతో పాటు పరిశ్రమల శాఖ కమిషనర్, ఎండీగానూ వ్యవహరించారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధిలో జయేశ్ రంజన్ అత్యంత కీలక పాత్ర పోషించారు. పదేళ్ల పాటు సమాచార సాంకేతిక, పరిశ్రమలు, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ సేవలందించారు. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన ‘టీ-హబ్’ ఏర్పాటుతో పాటు ఉన్నత ఐటీ విధానాల రూపకల్పనలో కీలక సూత్రధారిగా వ్యవహరించారు.

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, పారిశ్రామిక అభివృద్ధి సంస్థలలో మేనేజింగ్ డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సీఎం కార్యాలయం పరిశ్రమలు, పెట్టుబడుల సెల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జయేష్‌…ప్రభుత్వ ప్రాజెక్టులను వేగవంతం చేసే’SPEED’ (-Speed Proactive Efficient and Effective Delivery) సీఈఓగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వ మెట్రోపాలిటన్ ప్రాంత, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ బాధ్యతలతో పాటు యూత్ అడ్వాన్స్‌మెంట్, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖల అదనపు బాధ్యతలను కూడా చూస్తున్నారు. అయితే, వాస్తవానికి జయేశ్ రంజన్ సెప్టెంబర్ 30, 2027 పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ముందే ఆయన వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తితోనే ఆయన ముందే రిటైర్‌ అవ్వాలనుకుంటున్నారన్నది సెక్రటేరియెట్‌ ఇన్‌సైడ్‌ టాక్‌.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

GITAM University: గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ

GITAM University: యువతలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు తెలంగాణ ‘ఈగిల్ ఫోర్స్’...

Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?

Story Board: దేశంలో ఉత్తరాదికీ, దక్షిణాదికీ రాజకీయంలో కచ్చితమైన తేడా ఉంది....

OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!

OTR: ఏపీలో మిగతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ఒక ఎత్తు, ఆ...

Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!

Off The Record: వైసీపీ కంచుకోటగా చెప్పుకునే కడప జిల్లాలో ఆ...