25
October, 2026

A News 365Times Venture

25
Sunday
October, 2026

A News 365Times Venture

Astra Missile: భారత ‘‘అస్త్ర క్షిపణి’’పై ఇండోనేషియా ఆసక్తి..

Date:

Astra Missile: భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులపై విదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే బ్రహ్మోస్ మిస్సైల్‌ కొనుగోలుకు ఇండోనేషియా సిద్ధమైంది, ఇప్పుడు భారత్ అభివృద్ధి చేసిన ‘‘అస్త్ర Mk-1’’ గగనతల క్షిపణులను తన Su-30MK2 యుద్ధవిమానాలకు అనుసంధానించే అవకాశాలను కూడా ఇండోనేషియా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2026 జూన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో అస్త్ర Mk-1 కొనుగోలుపై సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తుది నిబంధనలు, సాంకేతిక అంశాలపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

అస్త్ర క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేయగా, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) తయారు చేస్తోంది. ఇది బియాండ్ విజువల్ రేంజ్‌(BVR)కు అవతల ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగల ‘‘ఎయిర్ టూ ఎయిర్ మిస్సైల్’’. అస్త్రా ఎగుమతి వెర్షన్ పరిధి సుమారు 110 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ఇండోనేషియా రష్యన్ తయారీ R-77 గగనతల క్షిపణులను ఉపయోగిస్తోంది. వీటి పరిధి సుమారు 70-80 కి.మీ ఉండొచ్చు. అస్త్ర Mk-1ను విజయవంతంగా సుఖోయ్ విమానాలకు అనుసంధానిస్తే ఇండోనేషియా వైమానిక దళం శక్తి మరింత పెరుగుతుంది.

ఇక్కడే ప్రధాన సమస్య..

అస్త్ర క్షిపణిని ఇండోనేషియా Su-30MK2 యుద్ధవిమానాలకు అనుసంధానించడంలో ప్రధాన సాంకేతిక సవాలు రాడార్ వ్యవస్థల తేడా ఉండటమే. భారత Su-30MKI విమానాల్లో N011M Bars రాడార్ ఉండగా, ఇండోనేషియా Su-30MK2 విమానాల్లో N001VEP పల్స్-డాప్లర్ రాడార్‌ను ఉపయోగిస్తోంది. ఈ రెండు వ్యవస్థల లక్షణాలు వేరేగా ఉంటాయి. దీంతో అస్త్ర క్షిపణిని సమర్థంగా పనిచేసేలా చేయడానికి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అవసరమయ్యే అవకాశ ఉంది. ప్రస్తుతం.. భారత్, ఇండోనేషియా ఇంజనీర్లు క్షిపణి అనుసంధానం, అనుకూలతలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం

Saurav Das: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్ సౌరవ్ దాస్‌‌కు...

Himanta Biswa Sarma: 57 ఏళ్ల వ్యక్తి Gen Zనా? రాహుల్‌ గాంధీపై హిమంత సెటైర్లు..

Himanta Biswa Sarma: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని...

Farooq Abdullah: ఆర్టికల్ 370 కోసం ఉద్యమిస్తాం.. ఫరూఖ్ అబ్దుల్లా కీలక ప్రకటన!

Farooq Abdullah: ఆర్టికల్ 370 పునరుద్ధరణ, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా...

Kolhapur Gold Theft: మామ ఇంట్లో బంగారం చోరీ చేసి థార్ కొనుగోలు.. కారు పూజకు మామే చీఫ్ గెస్ట్!

Kolhapur Gold Theft: మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా ఓ దొంగతనం వైరల్‌గా...