11
October, 2026

A News 365Times Venture

11
Sunday
October, 2026

A News 365Times Venture

Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..

Date:

Supreme Court: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అక్టోబర్ 10 శనివారం భారీ నిరసన పిలుపునిచ్చింది. ఢిల్లీ పోలీసులు నగరంలో ఆంక్షలు విధించి పలువురు నేతలు, నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ కీలక నేతలు అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను విమానంలో పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారు.

ఇదిలా ఉంటే, ఢిల్లీలో ఆంక్షలు, ప్రతిపక్ష నేతల నిర్బంధాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఆదివారం (అక్టోబర్ 11)న ప్రత్యేకంగా విచారణ చేపట్టనుంది. అక్టోబర్ 09న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు ఉల్లంఘించారంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌తో పాటు, నిరసనకారుల నిర్బంధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లను ధర్మాసనం విచారించనుంది.

జస్టిస్ జోయ్‌బాల్య బాగ్చి, జస్టిస్ వి. మెహనాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తుంది. అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ఆరోపిస్తూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ డి. థారాపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని పిటిషనర్ కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలున్నప్పటికీ మెట్రోస్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు కొనసాగించారని పిటిషనర్ ఆరోపించారు.

మరోవైపు, ఢిల్లీలో నిరసనల సందర్భంగా పలువురు నిరసనకారులు, ప్రతిపక్ష నేతల ముందస్తు నిర్బంధాన్ని సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. నలుగురు మాజీ సీఎంలను కూడా నిర్బంధించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును అణిచివేయడానికి ముందస్తు నిర్బంధాన్ని ఉపయోగించకూడదని మేనకా గురుస్వామి పిటిషన్‌లో వాదించారు.

అక్టోబర్ 09న సుప్రీంకోర్టు ఏం చెప్పింది.?

అక్టోబర్ 09న ఢిల్లీలో ఆంక్షలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లతో పాటు ఢిల్లీకి వచ్చే రైళ్లను రద్దు చేయడంపై పలువురు సుప్రీంకోర్టులో వాదించారు. అయితే, ప్రజలకు పూర్తి రవాణా అందుబాటులో ఉండకుండా ఆంక్షలు విధించలేరని, భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెట్రో, రైల్వే సేవల్ని నియంత్రించవచ్చని, వాటిని పూర్తిగా నిలిపేయకూడదని స్పష్టం చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు

ఉత్తరాఖండ్‌లో శనివారం రెండుసార్లు భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఉత్తరకాశిలో 4.2, బాగేశ్వర్‌లో...

CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..

ఎల్‌నినో ప్రభావం వల్ల అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో తెలంగాణ...

Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..

భారత క్రికెట్ జట్టు మాజీ విద్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ యువ...

Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా

దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు, పోలీసుల చర్యల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు...