10
October, 2026

A News 365Times Venture

10
Saturday
October, 2026

A News 365Times Venture

IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..

Date:

రాంచీలోని జెఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శనతో హోరెత్తించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణయాన్ని భారత బ్యాటర్లు పూర్తిగా తిప్పికొట్టారు. మ్యాచ్ ఆరంభం నుంచే విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 249 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ అభిషేక్ శర్మ 20 పరుగులు చేసి వెనుదిరిగినప్పటికీ, మరో ఓపెనర్ సంజూ శాంసన్ మాత్రం క్రీజులో నిలదొక్కుకుని విండీస్ బౌలర్లను ఉతికిపారేశాడు. సంజూ శాంసన్ కేవలం 41 బంతుల్లోనే 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 82 పరుగులు సాధించి అదరగొట్టాడు. అతనితో పాటు మరో బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా చెలరేగి ఆడి 22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 43 పరుగులు చేసి అద్భుతమైన సహకారం అందించాడు. వీరిద్దరి ధాటికి భారత ఇన్నింగ్స్ వేగంగా దూసుకుపోయింది.

మధ్యలో వచ్చిన ఆటగాళ్లు కూడా తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 18 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి రాణించాడు. ఇక చివర్లో తిలక్ వర్మ 18 బంతుల్లో 44 పరుగులు, నమన్ ధీర్  లాస్ట్ బాల్ కు ఫోర్ కొట్టాడు. ఎక్స్‌ట్రాల రూపంలో మరో 9 పరుగులు రావడంతో భారత్ 249 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ మూడు వికెట్లు పడగొట్టగా, షామర్ స్ప్రింగర్ రెండు వికెట్లు దక్కించుకున్నప్పటికీ భారత బ్యాటర్ల జోరును అణచివేయలేకపోయారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్

భారత క్రికెట్ జట్టులో సీనియర్ పేసర్ల పునరాగమనంపై చర్చ జోరుగా సాగుతోంది....

INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..

INDIA bloc:  ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును శుక్రవారం...

Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..

Rahul Gandhi: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ద్వారా...

Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్‌లో హెచ్‌పి, డెల్, ఆసుస్,...