20
September, 2026

A News 365Times Venture

20
Sunday
September, 2026

A News 365Times Venture

Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?

Date:

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాకముందే టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక ఫోన్ ఫిబ్రవరి 2027 ప్రారంభంలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్‌లో దీని ధర దాదాపు 1,41,999 రూపాయల నుంచి 1,46,999 రూపాయల మధ్య ఉండవచ్చని లీకైన సమాచారం ద్వారా తెలుస్తోంది.

ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎస్27, గెలాక్సీ ఎస్27 అల్ట్రా, గెలాక్సీ ఎస్27 ప్లస్ అనే మూడు మోడళ్లను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. లీకైన వివరాల ప్రకారం.. ఈ అల్ట్రా మోడల్ అద్భుతమైన ఫీచర్లు, అద్భుతమైన కెమెరా వ్యవస్థతో వినియోగదారులను ఆకట్టుకోనుంది. ఫోన్ వెనుకవైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో కూడిన 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, మరో 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ ఉండొచ్చు.

ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించే అవకాశం ఉంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.9-అంగుళాల అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు.

పనితీరు పరంగా చూస్తే.. ఈ డివైస్ త్వరలో రానున్న క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్‌తో పాటు 12 జీబీ రామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు. అత్యంత అధునాతన 2ఎన్ఎం ప్రాసెస్పై ఈ ప్రాసెసర్ తయారవుతుందని సమాచారం.

కేవలం 7.9 ఎంఎం మందంతో రానున్న ఈ ఫోన్‌లో ఎస్-పెన్ సపోర్ట్ కూడా లభించనుంది. అంతేకాకుండా.. ఇందులో కనీసం 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 7000 ఎంఏహెచ్ బలమైన సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సరికొత్త టెక్నాలజీతో, అత్యుత్తమ ఫీచర్లతో వస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!

BJP-GenZ:  ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ (DUSU) ఎన్నికల ఫలితాలు విద్యార్థి...

Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..

Asaduddin Owaisi:  సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)...

US: అమెరికాస్ గాట్ టాలెంట్‌ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్

హ్యూమనాయిడ్ రోబోలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. చైనాకు చెందిన డ్యాన్సర్...

Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్

Yogi Adityanath:  మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ...