18
September, 2026

A News 365Times Venture

18
Friday
September, 2026

A News 365Times Venture

Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..

Date:

భారత యువ సంచలనం అభిషేక్ శర్మ అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ రికార్డులను తిరగరాశాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లోనే అద్భుతమైన శతకం సాధించి టెస్ట్ ఆడే దేశాల నుంచి టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. శతకం పూర్తి చేసుకున్న తర్వాత వినూత్నంగా మైదానంలోనే మెడిటేషన్ యోగా భంగిమలో కూర్చుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే అఫ్గానిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడిన అభిషేక్ శర్మ గ్రౌండ్ నలుమూలలా భారీ సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా పవర్‌ప్లే ముగిసేసరికి కేవలం 22 బంతుల్లోనే అజేయంగా 76 పరుగులు చేసి టీ20 చరిత్రలో పవర్‌ప్లేలో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ప్రపంచ రికార్డును కూడా తన పేరు మీదకు మార్చుకున్నాడు.

సంజూ శామ్‌సన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆయన తొలి వికెట్‌కు అత్యంత వేగంగా భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కేవలం 30 బంతుల్లోనే వంద పరుగుల మార్క్‌ను దాటిన అభిషేక్ శర్మ, తన కెరీర్‌లో ఇది మూడో టీ20 సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున విధ్వంసకర ఓపెనర్‌గా రాణించిన ఆయన, ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ తనదైన దూకుడుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఆటగాళ్ల ప్రశంసలు అందుకుంటూ భారత జట్టు భవిష్యత్తు స్టార్‌గా ఎదుగుతున్నాడు.

అగ్రస్థానంలో అభిషేక్.. 

అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీలు బాదిన జాబితాలో అభిషేక్ శర్మ అగ్రశ్రేణి ఆటగాళ్ల సరసన నిలిచాడు. ఈ జాబితాలో ఎస్టోనియా ఆటగాడు చౌహాన్ సైప్రస్‌పై కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రథమ స్థానంలో ఉండగా, టర్కీకి చెందిన ముహమ్మద్ ఫహద్ బుల్గేరియాపై 29 బంతుల్లో శతకం బాది రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తాజాగా అఫ్గానిస్తాన్‌పై 30 బంతుల్లోనే వంద పరుగుల మార్క్‌ను అందుకున్న అభిషేక్ శర్మ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో నంబియా ఆటగాడు జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్ (33 ), జింబాబ్వే స్టార్ సికందర్ రజా (33 ), అలాగే న్యూజిలాండ్‌పై ఫిన్ అలెన్ (33 ) ఉన్నారు. మొత్తం ఇండియా నుంచి తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు స్పష్టించాడు. ఐసీసీ ఫుల్ మెంబర్స్ టీమ్స్ లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!

Pakistan: అరేబియా సముద్రంలో పాకిస్తాన్ నేవీ, భారత నేవీని కవ్వించే ప్రయత్నం...

Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?

భారత్‌లో వైవాహిక అత్యాచారం (Marital Rape) అంశంపై దాదాపు దశాబ్దంగా కొనసాగుతున్న...

Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..

Third Front: జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తే ‘‘థర్డ్ ఫ్రంట్’’కు...

Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?

గత కొద్దిరోజులుగా సౌదీ లక్ష్యంగా హౌతీలు భీకర దాడులు చేస్తున్నారు. తాజాగా...