18
September, 2026

A News 365Times Venture

18
Friday
September, 2026

A News 365Times Venture

US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన

Date:

అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బాల్టిమోర్ నుంచి మియామీకి వెళ్తున్న విమానంలో ఓ మహిళ అకస్మాత్తుగా దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా తిరిగింది. విమానంలో అటు ఇటు తిరుగుతూ కేకలు వేసింది. దీంతో సహచర ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. అంతటితో ఆగకుండా తోటి ప్రయాణికుల ఎదుట అసభ్యంగా ప్రవర్తించడంతో విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. చివరకు విమానం మియామీ చేరుకున్న వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ AA1779లో సెప్టెంబర్ 11న ఈ ఘటన జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. బాల్టిమోర్/వాషింగ్టన్ ఇంటర్నేషనల్ థర్గుడ్ మార్షల్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం రాత్రి 9 గంటల తర్వాత బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం బయలుదేరాల్సిన సమయం కంటే దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విమానం టేకాఫ్ అయింది. విమానం గాల్లో ఉండగా 9D సీటులో కూర్చున్న మహిళ తన దుస్తులన్నింటినీ తొలగించినట్లు ఇతర ప్రయాణికులు గుర్తించారు. అనంతరం ఆమె తోటి ప్రయాణికుల సమక్షంలో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విమాన సిబ్బంది గుర్తించారు.

ఈ విషయాన్ని లీడ్ ఫ్లైట్ అటెండెంట్ వెంటనే కాక్‌పిట్ సిబ్బందికి తెలియజేశారు. అనంతరం విమాన సిబ్బంది, ఎయిర్‌లైన్ ఆపరేషన్స్ సెంటర్ మధ్య సమాచారం మార్పిడి జరిగింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విమానం మియామీ చేరుకున్న వెంటనే పోలీసులను సిద్ధంగా ఉంచాలని సిబ్బంది కోరారు. అయితే ఈ ఘటన కారణంగా విమానాన్ని దారి మళ్లించలేదు. విమానం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఫ్లోరిడాలోని మియామీ వైపు వెళ్లింది. ఇదే సమయంలో ఎయిర్‌లైన్ అధికారులు పోలీసు అధికారులతో సమన్వయం చేశారు. విమానం మియామీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకునే సమయానికి పోలీసులు గేట్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. విమానం రాత్రి సుమారు 11.23 గంటలకు టెర్మినల్ ఎన్‌లోని గేట్ D2కి చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు విమానాల్లో ఉపయోగించే ఏసీఏఆర్‌ఎస్ (ACARS) కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా వెలుగులోకి వచ్చాయి. విమాన సిబ్బంది, ఎయిర్‌లైన్ మధ్య ఆపరేషనల్ సమాచారాన్ని పంపేందుకు ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఈ విమానం ఎయిర్‌బస్ A319. బాల్టిమోర్ నుంచి మియామీ వరకు ప్రయాణానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఈ విమానంలో గరిష్ఠంగా 160 మంది ప్రయాణికులున్నారు. అయితే విమానంలో సిబ్బంది ఆ మహిళను ఎలా నియంత్రించారు? ఇతర ప్రయాణికులకు ఆమె ప్రవర్తన వల్ల ఎంతవరకు ఇబ్బంది కలిగింది? ఆమె ఈ విధంగా ఎందుకు ప్రవర్తించింది? ఆమెపై ఎలాంటి కేసులు నమోదు చేశారు? వంటి వివరాలు వెంటనే వెల్లడికాలేదు. అలాగే ఆమె గుర్తింపును కూడా అధికారులు అధికారికంగా వెల్లడించలేదు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?

భారత్‌లో వైవాహిక అత్యాచారం (Marital Rape) అంశంపై దాదాపు దశాబ్దంగా కొనసాగుతున్న...

Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..

Third Front: జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తే ‘‘థర్డ్ ఫ్రంట్’’కు...

Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?

గత కొద్దిరోజులుగా సౌదీ లక్ష్యంగా హౌతీలు భీకర దాడులు చేస్తున్నారు. తాజాగా...

AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!

AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ...