15
September, 2026

A News 365Times Venture

15
Tuesday
September, 2026

A News 365Times Venture

Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన

Date:

ఉక్రెయిన్- రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాలు పరస్పరం తమ ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయకూడదని అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయం ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ముందడుగుగా అభివర్ణించారు. తాజాగా ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఉక్రెయిన్ రష్యా ఎనర్జీ లక్ష్యాలపై దాడులు చేయకూడదని అంగీకరించింది. రష్యా కూడా అదే విధంగా వ్యవహరించేందుకు అంగీకరించింది’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా డీజిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం రష్యా-ఉక్రెయిన్ యుద్ధమేనని ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం వల్ల కాదని స్పష్టం చేశారు. అంతకుముందు ఆదివారం కూడా ట్రంప్.. రష్యాలోని డీజిల్ మౌలిక వసతులపై దాడులు చేయకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఉక్రెయిన్ దాడుల కారణంగా డీజిల్ కొరత ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. లక్ష్యాలపై దాడులు చేయడాన్ని తాను వ్యతిరేకించడం లేదని, అయితే డీజిల్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవద్దని ట్రంప్ సూచించారు. ఇలాంటి దాడుల వల్ల డీజిల్ కొరత ఏర్పడుతోందని అన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా స్వాగతం

ఉక్రెయిన్.. రష్యా డీజిల్ ఉత్పత్తి కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ చేసిన పిలుపును రష్యా స్వాగతించింది. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను సానుకూలంగా చూస్తున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ‘‘పౌర, ఆర్థిక మౌలిక వసతులపై దాడులు నిలిపివేయాలని కీవ్ ప్రభుత్వాన్ని కోరడం స్వాగతించదగిన విషయమే’’ అని పెస్కోవ్ అన్నారు. అయితే ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఏర్పడిన తీవ్ర అస్థిరతకు ప్రధాన కారణం గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న పరిణామాలేనని క్రెమ్లిన్ పేర్కొంది.

విట్‌కాఫ్, కుష్నర్ పర్యటన తర్వాత

అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ ఈ నెల ప్రారంభంలో మాస్కో, కీవ్‌లలో పర్యటించారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలతో వారు విడివిడిగా చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలతో యుద్ధాన్ని ముగించే విషయంలో పెద్దగా పురోగతి కనిపించలేదు. వారాంతంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ అనంతరం కూడా రష్యా, ఉక్రెయిన్ మరోసారి తీవ్ర వైమానిక దాడులకు దిగాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పర ఎనర్జీ మౌలిక వసతులపై దాడులు చేయకూడదన్న అంగీకారం యుద్ధ తీవ్రతను తగ్గించే దిశగా ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..

Saudi Arabia: సౌదీ అరేబియా జాక్‌పాట్ కొట్టింది. మదీనాలో భారీ స్థాయిలో...

Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం

రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం చెలాయించింది. చిన్న పట్టణాలు, గిరిజన...

Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..

భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా తన ‘విరాట్’ సిరీస్‌లో భాగంగా...

Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..

Ravi Shastri: న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్...