13
September, 2026

A News 365Times Venture

13
Sunday
September, 2026

A News 365Times Venture

Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..

Date:

Modi-Jinping: బ్రిక్స్ సమావేశాల కోసం చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ న్యూఢిల్లీ వచ్చారు. శనివారం సాయంత్రం భారత మండపంలో ఇరువురు నేతలు భేటీ కానున్నారు. భారత్-చైనా ద్వైపాక్షిక చర్చలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. వాణిజ్య లోటు, రేర్ ఎర్త్ మినరల్స్, ఎరువు సరఫరా, వాణిజ్య ఒప్పందాల వంటి పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మోడీ-జిన్‌పింగ్ భేటీపై ప్రపంచ దృష్టి నెలకొంది.

అరుదైన ఖనిజాలపై చర్చ:

ప్రపంచ టెక్నాలజీకి ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ కీలకంగా మారాయి. ఈ రంగంలో చైనా 90 శాతం వాటాను నియంత్రిస్తోంది. భారతదేశం ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తోంది. సెమీకండక్టర్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో, భారత ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఈవీ, బ్యాటరీ, రక్షణ, హైటెక్ తయారీ రంగాలకు ఈ అరుదైన రేర్ ఎర్త్ మెటల్స్ చాలా కీలకం. రేర్ ఎర్త్ మెటల్స్ గురించి భారత్, చైనా మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.

వాణిజ్య లోటు:

భారత దేశానికి సంబంధించి ఆందోళన కలిగించే అంశం చైనాతో ఉన్న వాణిజ్యలోటు. చైనా నుంచి భారత్ భారీ స్థాయిలో దిగుమతులు చేసుకుంటోంది. ఇదే సమయంలో చైనాకు భారత ఎగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి. 2025లో, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారుగా $155.6 బిలియన్లకు చేరుకోగా, చైనాతో భారతదేశ వాణిజ్య లోటు సుమారుగా $115 బిలియన్లుగా ఉంది. భారత్ చైనా నుంచి ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, రసాయనాలు, సౌర పరికరాలు, ఇతర వస్తువుల్ని కొనుగోలు చేస్తోంది. ఈ చర్చల్లో భారత వస్తువులకు చైనా తన మార్కెట్ తెరిచేలా ప్రోత్సహించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

మోడీ-జిన్‌పింగ్ భేటీపై ప్రపంచం దృష్టి:

2020లో గాల్వాన్ సంఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇరు దేశాలు ప్రస్తుతం చర్చలు, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడం వల్ల ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఏడేళ్ల తర్వాత తొలిసారి జిన్‌పింగ్ భారత్ వస్తుండటం, మోడీతో భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జనాభా పరంగా, ఆర్థిక పరంగా అతిపెద్ద దేశాలుగా ఉన్న చైనా, భారత్ కలిసి పనిచేస్తే అది ప్రపంచానికి సహాయంగా ఉంటుంది. దీంతో ఈ భేటీపై ప్రపంచ దృష్టి నెలకొంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..

Bangladesh: బంగ్లాదేశ్‌లో విద్యుత్ సంక్షోభం ముదిరింది. జార్ఖండ్ రాష్ట్రంలోని అదానీ పవర్‌కు...

SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..

భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) చిన్న వ్యాపారులకు రుణాలు అందించేందుకు ఒక...

PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు

PM Modi: 18వ బ్రిక్స్ సమావేశాలు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్రమోడీ...

Nani: నా కెరీర్‌లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!

న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న...