7
September, 2026

A News 365Times Venture

7
Monday
September, 2026

A News 365Times Venture

Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం

Date:

Iran-Israel War: ఇజ్రాయిల్‌పై భారీ దాడికి ఇరాన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 7, 2023లో హమాస్ ఇజ్రాయిల్‌పై చేసిన దాడి కన్నా పెద్ద దాడిని చేయాలని భావిస్తున్నట్లు ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ అంచనాలను ఉటంకిస్తూ జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఈ దాడికి ఇరాన్ తన ప్రాక్సీలను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. లెబనాన్ నుంచి హిబ్బుల్లా, గాజాలోని హమాస్, యెమెన్ లోని హైతీలు, ఇరాన్-సిరియాల్లోని ఇరాన్ అనుకూల మిలీషియా ఇలా నాలుగు వైపుల నుంచి ఇజ్రాయిల్‌పై దాడికి ఇరాన్ ప్లాన్ చేసిందని నివేదిక చెబుతోంది. ఈ దాడి ద్వారా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఈ ప్రాక్సీలను ‘‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’’గా పిలుస్తుంది.

2023 అక్టోబర్ 07న హమాస్ ఇజ్రాయిల్‌పై భారీ దాడి చేసింది. ఈ దాడిలో చాలా మందిని చంపేసి, పలువురిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. అయితే, ఈ దాడి సమయంలోనే ఇరాన్, దాని అనుకూల గ్రూపులు కూడా దాడి చేయాలని భావించినా, సమన్వయం లేకపోవడంతో ప్లాన్ విఫలమైనట్లు అమెరికా, ఇజ్రాయిల్ ఇంటెల్ అంచనాలను నివేదిక ప్రస్తావించింది. ఫలితంగా హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయిల్ వైపు పరిమిత దాడులకే పరిమితమైంది. అంతా అనుకున్నట్లు ఇజ్రాయిల్‌పై ఈ దాడి విజయవంతమైతే ఇరాన్, హిజ్బుల్లా ఇతర ప్రాంతీయ శక్తులు ఈ యుద్ధంలోకి వస్తాయని హమాస్ మాజీ నేత యాహ్యా సిన్వార్ భావించినట్లు గాజా నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా నివేదిక పేర్కొంది.

గత దాడిలో జరిగిన సమన్వయ లోపాన్ని అధిగమించేందుకు ఇరాన్ ముందుగానే సమన్వయంతో కూడిన దాడి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.హిజ్బుల్లా, హమాస్, హౌతీలు ఇతర ఇరాన్ అనుకూల మిలీషియా వేరువేరుగా స్పందించడం కాకుండా ఒకేసారి దాడి చేసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC)లోని ఖుద్స్ ఫోర్స్ ఉన్నతాధికారులు హిజ్బుల్లా, హౌతీలు, ఇరాక్ మిలీషియాల కమాండర్లతో సమావేశాలు, కాన్ఫరెన్స్ కాల్స్ నిర్వహించినట్లు కూడా నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుత యుద్ధంలో దెబ్బతిన్న తమ సైనిక సామర్థ్యాలను తిరిగి పెంచుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!

CM Revanth Reddy: శాసనసభలో బీజేపీ సభ్యుల తీరుపై సీఎం రేవంత్‌...

NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు...

Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్‌డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’...

TPCC Mahesh Goud : సురేఖ ఎపిసోడ్‌పై మహేష్ గౌడ్ క్లారిటీ

తెలంగాణ రాజకీయంలో తీవ్ర సంచలనం సృష్టించిన కొండా సురేఖ మంత్రివర్గ తొలగింపు...