5
September, 2026

A News 365Times Venture

5
Saturday
September, 2026

A News 365Times Venture

Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?

Date:

Off The Record: తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్‌ చేయడంతో త్వరలోనే కేబినెట్‌ విస్తరణ ఉండొచ్చన్న ఊహాగానాలు పెరిగిపోయాయి. ఇన్నాళ్లు కేబినెట్‌లో రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు సురేఖను తప్పించడంతో ఖాళీల సంఖ్య మూడుకు పెరిగింది. మరి ఈ మూడు మంత్రి పదవులను ఎప్పుడూ భర్తీ చేస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. కేబినేట్ విస్తరణ ఇప్పట్లో ఉంటుందా..? ఆ అవకాశమే ఉండదా..? అనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లోనే కాకుండా తెలంగాణలో కూడా నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత.. కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించే అవకాశముందట. ఇప్పటికే ఈ విషయంలో అధిష్టానం నుంచి అనుమతి తీసుకున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలంటున్నాయి. ముహూర్తం ఫిక్స్ చేసుకోవాల్సింది సీఎం రేవంతే. కేబినెట్‌ విస్తరణలో బీసీ సామాజికవర్గానికి అవకాశం దక్కడం పక్కానే. ఎందుకంటే బీసీ మంత్రి అయిన కొండా సురేఖను పదవి నుంచి తప్పించినందున… బీసీ సామాజికవర్గం నుంచి ఒకరిని కేబినెట్‌లోకి తీసుకోవడం ఖాయమే. మరి ఛాన్స్‌ దక్కేదెవరికి..?

ఆశావహులు అనేకమంది ఉన్నారు. బీసీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముందు వరుసలో ఉన్నారట. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేరు కూడా పరిశీలనలో ఉందట. కేబినెట్‌ నుంచి తప్పించింది మహిళను కదా… ఆ ప్లేస్‌లో మహిళనే తీసుకోవాలి కదా..? అనే చర్చకు స్పేస్ ఇవ్వకుండా ముగ్గురు మహిళా నేతలకు పదవులు ఇచ్చేశారు. ఇక మిగిలిన రెండు మంత్రి పదవులను ఎలా భర్తీ చేయాలి..? రెడ్డి సామాజిక వర్గానికి ఒక పదవి ఇవ్వడం పక్కా. ఆ కోటాలో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డికి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. పైగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్క మంత్రి కూడా లేరు. దీంతో ఆ జిల్లాకు అవకాశం ఇవ్వాలనే ఈక్వేషన్‌ ఉందట. మరో వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చాలారోజులుగా పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రాజగోపాల్‌ రెడ్డి. ఆయన్ని కేబినేట్‌లోకి తీసుకున్నాక కూడా పంథా మార్చకపోతే పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోందట. రాజగోపాల్‌ రెడ్డి తన పంథాలోనే కంటిన్యూ అయితే పార్టీకి నష్టం జరిగే అవకాశం లేకపోలేదనే మాటలు వినిపిస్తున్ననాయి. పైగా కోమటిరెడ్డి కుటుంబంలో ఇద్దరికి ఛాన్స్ ఇవ్వడంపై అధిష్టానం కూడా భిన్నరకాలుగా చర్చిస్తుంది.

మరో మంత్రి పదవి STల నుంచి లంబాడా సామాజికవర్గానికి ఇవ్వాలనే చర్చ కాంగ్రెస్‌లో జరుగుతోందట. లంబాడా వర్గానికి ఇచ్చేట్టు అయితే… దేవరకొండ MLA బాలు నాయక్ రేసులో ఉంటారని కాంగ్రెస్‌ వర్గాల సమాచారం. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి ఇచ్చి, బాలు నాయక్‌కు కూడా మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే… ఇద్దరూ ఒకే జిల్లాకు చెందినవారు అవుతారు. దీనిని కూడా పార్టీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు రెడ్డి మంత్రులున్నారు. మళ్ళీ మూడో రెడ్డికి అవకాశం ఇస్తారా..? మరోవైపు బాలు నాయక్‌ను… డిప్యూటీ స్పీకర్ చేయాలనే చర్చ కూడా వచ్చిందట. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించారు కాబట్టి ఆ జిల్లాకు చెందిన లంబాడాకు అవకాశం ఇస్తారా..? అనే చర్చ కూడా నడుస్తోంది. అలాగైతే రామచంద్రు నాయక్‌ పేరును పరిశీలించాల్సి ఉంటుంది. ఆయనపై అధిష్ఠానం ఇప్పటికే సీరియస్‌గా ఉంది. డిప్యూటీ స్పీకర్‌గా అభ్యర్థిత్వం ప్రకటించినా… పదవి తీసుకోకపోవడంపై కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జున ఖర్గే సీరియస్‌గా ఉన్నారట. మరి లంబాడా కోటాలో బాలు నాయక్‌ మంత్రి అవుతారా..? లేదంటే రామచంద్ర నాయక్‌కు అవకాశం దక్కుతుందా..? అనే చర్చ కాంగ్రెస్‌లో గట్టిగానే నడుస్తోందట. మరి సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఏముంది..? ఆయన ఎవరిని ఎంపిక చేసుకుంటారు..? అనేది త్వరలో క్లారిటీ రావొచ్చంటున్నాయి గాంధీభవన్ వర్గాలు.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!

AP Weather Forecast: ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌...

Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్‌డేట్.. వేచి చూడండి!

తెలంగాణ కాంగ్రెస్‌లో గత రెండు, మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా...

OTR: స్థానిక సమరం.. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతల్లో గుబులు..

స్థానిక సమరానికి వైసీపీ అధినేత జగన్ శంఖారావం పూరించడమే కాదు.. నేతల...