25
August, 2026

A News 365Times Venture

25
Tuesday
August, 2026

A News 365Times Venture

AP High Court: విశాఖ డేటా సెంటర్‌పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు

Date:

AP High Court: విశాఖ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డేటా సెంటర్‌కు సంబంధించిన నిర్మాణ పనులు చట్ట నిబంధనలు, పర్యావరణ అనుమతులకు లోబడి మాత్రమే చేపట్టాలని స్పష్టం చేసింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చిచెప్పింది. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూములను హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్‌కు కేటాయిస్తున్నారంటూ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. డేటా సెంటర్‌కు సమీపంలో అటవీ ప్రాంతం, జలాశయం ఉన్నాయని.. ప్రాజెక్ట్ వల్ల వన్యప్రాణులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ప్రాజెక్ట్ ‘ఏ’ కేటగిరీ కిందకు వస్తుందని.. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని వాదించారు. దేవస్థాన భూములను ఎలా కేటాయించారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. భూములను కేటాయించలేదని.. దేవస్థాన అథారిటీ 11 ఏళ్లకు లీజుకు ఇవ్వనుందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ లీజు ద్వారా దేవస్థానానికి ఏడాదికి 26 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపింది. డేటా సెంటర్ పనులు చట్ట నిబంధనలు, పర్యావరణ అనుమతులకు అనుగుణంగానే చేపడతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. ఆ హామీని తప్పనిసరిగా అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్‌కు జాక్‌పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!

Telangana Liquor : రాష్ట్రంలోని మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే...

Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన

తమిళనాడు రాజకీయాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో తీవ్ర...

Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తన నోటికి...

Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం

Swine Flu H1N1 in India: కరోనా ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది.....