20
August, 2026

A News 365Times Venture

20
Thursday
August, 2026

A News 365Times Venture

8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!

Date:

Realme P4s 5G: రియల్‌మీ (Realme) నుండి కొత్త P4s 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. P4 సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ ఫోన్‌ను ఆగస్టు 26న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో Realme P4, P4 Lite, P4x, P4 Pro 5G మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా వీటికి P4s 5G జతకానుంది. Realme P4s 5Gను ఆగస్టు 26న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. గ్రీన్, బ్రౌన్ బేజ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు టీజర్ ద్వారా వెల్లడైంది. ధరను మాత్రం కంపెనీ ఇంకా ప్రకటించలేదు. లాంచ్ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఈ Realme P4s 5Gలో శాంసంగ్ M14 డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది 1,272 × 2,772 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. స్క్రీన్ గరిష్టంగా 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే HDR10+తో పాటు నెట్ఫ్లిక్ HDR కంటెంట్‌కు కూడా ఈ డిస్‌ప్లే సపోర్ట్ చేస్తుంది. ముందటి డిస్‌ప్లేలతో పోలిస్తే 26% మెరుగైన ల్యూమినస్ ఎఫిషియెన్సీ, 50% ఎక్కువ స్క్రీన్ లైఫ్‌ను అందిస్తుందని రియల్‌మీ తెలిపింది.

Image (1)

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7400 Ultra 5G చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్, గేమింగ్ వంటి పనితీరు ఆధారిత టాస్క్‌ల కోసం ప్రత్యేకంగా HyperVision+ AI చిప్ కూడా ఇందులో ఉంటుంది. దీంతో రోజువారీ పనులతో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి అవసరాలకు మెరుగైన పనితీరును అందించే అవకాశం ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే 50MP డ్యూయల్ AI కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరాకు OIS సపోర్ట్ అందించారు. దీంతో ఫోటోలు, వీడియోలు తీసేటప్పుడు కెమెరా షేక్‌ను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

Image

ఈ ఫోన్‌లో ప్రధానంగా 8,000mAh భారీ బ్యాటరీను చెప్పుకోవచ్చు. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు వినియోగాన్ని అందించగలదని కంపెనీ చెబుతోంది. డ్యామేజ్ నుంచి రక్షణ కోసం IP66+IP68+IP69 రేటింగ్స్ అందించారు. అంటే దుమ్ము, నీరు వంటి వాటి నుంచి ఫోన్‌కు మెరుగైన రక్షణ లభించనుంది. లీకుల ప్రకారం ఈ మొబైల్ నాలుగు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో తీసుకురావచ్చని తెలుస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!

Green Chillies at Home: వంటకాలకు పచ్చిమిరపకాయలు చక్కటి కారం, రుచిని...

Ind Vs SL: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టు 165 పరుగుల...

7900mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

Redmi M100: షియోమీ సబ్‌ బ్రాండ్ రెడ్‌మీ నుంచి మరో కొత్త...

Indian Bowler: 10 వికెట్లతో శ్రీలంక నడ్డి విరిచిన భారత యువ బౌలర్.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం..

శ్రీలంకతో జరిగిన గాలే టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్...